Tollywood: రాజకీయాలకు టార్గెట్‌గా టాలీవుడ్..

ABN , Publish Date - Dec 16 , 2024 | 02:58 PM

టాలీవుడ్‌ను వరుస వివాదాలు ఇబ్బంది పెడుతున్నాయి.. అయితే అవి పొలిటికల్ టర్న్ తీసుకోవడం వెనుక కుట్ర జరుగుతుందనే చర్చ తెరపైకి వస్తుంది.

నటీనటుల వ్యక్తిగత వ్యవహారాలతో పాటు కొందరి వ్యాపార, కుటుంబ వివాదాల మొదలు అగ్ర హీరో అరెస్ట్ వరకు 2024లో అనేక కాంట్రవర్సీలు చిత్ర పరిశ్రమను కంగారు పెట్టాయి‌. అయితే సదరు వివాదాల్లో కొన్ని పొలిటికల్ టర్న్ తీసుకోవటం చూస్తుంటే.. తమ రాజకీయాలకు టాలీవుడ్‌ను ఓ టార్గెట్‌గా కొందరు పొలిటీషియన్స్ మార్చుకున్నారనే చర్చ నడుస్తొంది.


ప్రధానంగా ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల ఎపిసోడ్‌ను ఏపీలోని ఓ రాజకీయ పార్టీ బాగా వాడుకుని, తమకే అతని సపోర్ట్ ఉందన్నట్లుగా ప్రచారం చేసుకుంది. అనంతరం 'పుష్ప 2' విడుదలకు ముందు తర్వాత కూడా ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ మా వాడు, మా సినిమా అంటూ విపరీతంగా హడావుడి చేయటం అభిమానుల మధ్య చిచ్చు పెట్టిన్నట్లయింది. అయితే అల్లు అర్జున్ వైపు నుంచి ఈ విషయంలో మొదటి నుండి ఎలాంటి ఖండనలు రాకపోవటం..‌ చూసి చూడనట్లుగా వ్యవహరించటం మెగాభిమానుల్లో అతనిపై నెగిటివిటీకి కారణమయిందనే కామెంట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.


అయితే సంధ్య ధియేటర్ ఘటనలో అరెస్టై బెయిల్ పొంది జైలు నుంచి ఇంటికి వచ్చిన బన్నీ, మెగాస్టార్ చిరంజీవి, నాగాబాబులను కలవటంతో ఇన్నాళ్లు అతన్ని మోసిన రాజకీయ పార్టీకి షాక్ తగిలినట్లయింది.మెగా వర్సెస్ అల్లు అంశాన్ని వాడుకుని సదరు కుటుంబాలకు సంబందించిన వ్యక్తలను హేళన చెసిన సోషల్ సైకోలకు, అల్లు అర్జున్ మెగా బ్రదర్స్ బ్లెస్సింగ్స్ తీసుకోవటం ఏమాత్రం రుచించటం లేదనే ప్రచారం జరుగుతోంది.


ఇటు తెలంగాణా రాజకీయాల్లోనూ టాలీవుడ్ ఇష్యూ‌స్‌ను వేదికగా చేసుకుని పాలిటిక్స్ ప్లే అవుతున్నాయి. నాగార్జున, కొండా సురేఖ వివాదంలో కొందరు రాజకీయ నాయకులు అనవసరమైన కామెంట్స్ చేస్తూ వివాదాన్ని పెద్దది చేయాలని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలు చేశారనే వార్తలు వినిపించాయి. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం పైనా కూడా అదే తరహా పాలిటిక్స్ ను పలువురు రాజకీయ నాయకులు ప్లే చేశారనే డిస్కషన్ తెరమీదకు వచ్చింది. ఇక నాగార్జున కొండా సురేఖ వివాదం‌ టైమ్‌లోనూ, అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం చిత్ర పరిశ్రమ సంఘీబావం తెలిపిన విధానంపై కూడా రకరకాల ఓపినీయన్స్ వ్యక్తం అయ్యాయి.


అన్నింటిని మించి గద్దర్ అవార్డుల విషయంలో టాలీవుడ్ వైపు నుంచి సరైన కొర్డినేషన్ లేదనే విమర్శలు వినిపించిన క్రమంలో ప్రభుత్వానికి టాలీవుడ్ కు మధ్య ఏర్పడ్డ కమ్యూనికేషన్ గ్యాప్‌కు తోడు, వరుస వివాదాలు కూడా రావటం‌తో వాటిని తమకు అనూకూలంగా మార్చుకోవాలనే ప్రయత్నాలు పలు రాజకీయ పార్టీలు చెస్తున్నాయనే చర్చ సినీ రాజకీయ వర్గాల్లో నడుస్తొంది.

Updated Date - Dec 16 , 2024 | 03:53 PM