Allu Arjun Arrest: చిక్కడపల్లి పీఎస్‌కు సినీ ప్రముఖులు

ABN , Publish Date - Dec 13 , 2024 | 02:04 PM

అల్లు అరెస్ట్‌తో సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు చిక్కడపల్లి పీఎస్‌కు చేరుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎవరెవరు చేరుకున్నారంటే..

Allu Arjun Arrest

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ అరెస్ట్‌తో టాలీవుడ్‌లో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. అల్లు అర్జున్ అరెస్ట్‌పై ఇండస్ట్రీలో కూడా కదలిక మొదలైంది. అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన చిక్కడపల్లి పీఎస్‌కు సినీ ప్రముఖులు చేరుకుంటున్నారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, తమ్ముడు అల్లు శిరీష్, నిర్మాత దిల్ రాజు వంటి వారు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. మరి కొందరు సెలబ్రిటీలు సైతం చిక్కడపల్లి పీఎస్‌కు చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

Also Read-Allu Arjun: అల్లు అర్జున్‌ అరెస్ట్‌

సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ‘పుష్ప 2’ ప్రీమియర్ షో తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆమె భర్త భాస్కర్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు నేడు హీరో అల్లు అర్జున్‌ను (Allu Arjun Arrest) విచారణ నిమిత్తం అరెస్ట్‌ చేశారు.


అల్లు అర్జున్‌ ఇంటికి వెళ్లిన చిక్కడపల్లి పోలీసులు.. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్‌ను పోలీసులు విచారించనున్నారు. కాగా, ఇప్పటికే ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. తాను థియేటర్‌కు వస్తున్నట్లు ముందుగానే థియేటర్ యాజమాన్యానికి, పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు.

ఈ కేసులో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆయనపై 105, 118(1) రెడ్ విత్‌ 3/5 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Also Read-Game Changer: ‘గేమ్ చేంజర్’ అమెరికా ఈవెంట్ గెస్ట్ ఎవరో తెలుసా.. ‘పుష్ప’

Also Read-Allu Arjun: నంద్యాల వాటర్ వంటపట్టిందా.. సుకుమార్ పేరు కూడా తెలియదా

Also Read-రేలంగి వివాహ ఆహ్వాన పత్రిక: 91 సంవత్సరాల క్రితపు శుభలేఖను చూశారా..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 13 , 2024 | 02:13 PM