Tollywood: నిర్మాతలు.. ఓ సారి ఆలోచించండి
ABN , Publish Date - Nov 02 , 2024 | 11:00 AM
ఈ ఏడాది దీపావళి సందర్భంగా నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అందులో 'అమరన్’, 'బఘీర’ రెండు అనువాద చిత్రాలు. తెలుగులో స్ట్రెయిట్ సినిమాలు 'లక్కీ భాస్కర్' (Lucky Bhaskar) , 'క' (KA) చిత్రాలు విడుదలయ్యాయి.
ఈ ఏడాది దీపావళి సందర్భంగా నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అందులో 'అమరన్’, 'బఘీర’ రెండు అనువాద చిత్రాలు. తెలుగులో స్ట్రెయిట్ సినిమాలు 'లక్కీ భాస్కర్' (Lucky Bhaskar) , 'క' (KA) చిత్రాలు విడుదలయ్యాయి. 'బఘీరా' పక్కన పెడితే మిగిలిన మూడు చిత్రాలు పాజిటివ్ టాక్‌తో మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్నాయి. 'అమరన్' (Amaran), 'లక్కీ భాస్కర్', 'క' పండగ సీజన్‌కు క్యాష్ చేసుకున్నాయి. అయితే.. ఈ రెండు చిత్రాలను ‘అమరన్’ డామినేట్ చేస్తుందనే మాట వినిపిస్తోంది. మల్టీప్లెక్సుల్లో సత్తా చూపిస్తోంది. తమిళం నుంచి తెలుగుకి అనువాదం అయినా.. ప్రేక్షకులు చక్కగా ఆదరిస్తున్నారు. సినిమా బావుంది అంటే భాషతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఆదరించడం తెలుగువారిలో ఉన్న గొప్ప లక్షణం. అయితే ఇక్కడో సమస్య వెంటాడుతుంది. తెలుగులో ప్రామినెంట్ సినిమాలు ఉన్నప్పుడు పరభాషా చిత్రాలు విడుదలైతే.. అది తెలుగు సినిమాను దెబ్బకొడుతోంది. కలెక్షన్లపై ప్రభావం చూపుతోంది.
ఈ పండుగ సీజన్లో తెలుగులో లక్కీ భాస్కర్, క రెండు చిత్రాలే విడుదలైతే పరిస్థితి వేరుగా ఉండేది. అమరన్కు వెళ్లిన కలెక్షన్లను ఈ రెండు సినిమాలు షేర్ చేసుకునేవి. వసూళ్లలో ఇంకాస్త గ్రోత్ ఉండేది. సీజన్లో వేరే చిత్రాలు వేయకూడదని కాదు. కానీ తెలుగు సినిమాలను పరభాష నిర్మాతలు అడ్డుకుంటున్నారు. క సినిమాను తమిళ డిస్ట్రిబ్యూటర్స్ (Distributors) అడ్డుకుంటున్నారు. తమిళంలో దీపావళికి వస్తున్న సినిమాలకు ‘క’ అడ్డుగా నిలుస్తుందని వారి భయం. అందుకే.. ‘క’ తమిళంలో విడుదల కాలేదు. అక్కడ ఓ వారం ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నారు. మనం మాత్రం ఏ భాషలో సినిమా విడుదలైనా, అది ఎలాంటి సీజన్ అయినా, వాళ్లకు థియేటర్లు ఇచ్చేస్తాం. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. సంక్రాంతి, దసరా, దీపావళి లాంటి సీజన్లలో పక్క రాష్ట్రాల నుంచి వచ్చే డబ్బింగ్ సినిమాలకు అడ్డు కట్ట వేయాలి. ఓ వారం ఆలస్యంగా విడుదల చేయమని చెప్పాలి. అప్పుడు మంచి టాక్ తెచ్చుకున్న తెలుగు చిత్రాలకు మంచి వసూళ్లు వస్తాయి. దాని వల్ల ఎవరికీ ఏ అన్యాయం జరగదు. తమిళనాట తమిళ చిత్రాలకే ప్రాధాన్యం ఇచ్చినప్పుడు తెలుగులో ఆ రూల్ ఎందుకు రాకూడదు అన్నది ఇప్పుడు ప్రశ్న. మరి నిర్మాతలు (Tollywood Producers) దీనిపై ఏం ఆలోచిస్తారో చూడాలి.