NBK: బాలయ్యను కలిసిన దర్శకులు.. ఫొటోలు వైరల్‌!

ABN , Publish Date - Jun 07 , 2024 | 06:05 PM

నందమూరి బాలకృష్ణకు (NBK) టాలీవుడ్‌ దర్శకులు శుబాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో హిందూపురం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన భారీ మెజారిటీతో మూడోసారి విజయం సాధించారు

NBK:  బాలయ్యను  కలిసిన దర్శకులు.. ఫొటోలు వైరల్‌!


నందమూరి బాలకృష్ణకు (NBK) టాలీవుడ్‌ దర్శకులు శుబాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో హిందూపురం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన భారీ మెజారిటీతో మూడోసారి విజయం సాధించారు. దీంతో సినీ ప్రముఖులు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి(Anil ravipudi), బాబీ(bobby), గోపీచంద్‌ మలినేని (Gopichand malineni) బాలకృష్ణనుకలిశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. అభిమానులు ఆ ఫొటోలను విపరీతంగా షేర్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ ుఎనబీకే109’లో నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ నటుడు బాబీ దేవోల్‌ విలనగా కనిపించనున్నారు. ఇందులో బాలయ్య రెండు కోణాలున్న పాత్రల్లో కనువిందు చేయనున్నట్లు సమాచారం.   పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ నేపథ్యం ఉంటుందని టాక్‌.  ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంస్థతో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు.  

Updated Date - Jun 07 , 2024 | 06:07 PM