Tollywood: ప్రముఖ హాస్యనటుడికి యాక్సిడెంట్.. పరిస్థితి
ABN , Publish Date - Dec 05 , 2024 | 05:20 PM
టాలీవుడ్ చిత్రపరిశ్రమకి చెందిన ప్రముఖ హాస్యనటుడు యాక్సిడెంట్‌కి గురయ్యారు. ఆయన పరిస్థితి ఎలా ఉందంటే..
పేద కుటుంబం నుండి వచ్చి ఎంతో శ్రమతో సినీ పరిశ్రమలో మంచి కమెడియన్ గా, రైటర్‌గా పేరు తెచ్చుకున్న యంగ్ ఆర్టిస్ట్ ఆక్సిడెంట్‌కి గురయ్యారు. టీవీ షోలలో తనదైన రైటింగ్, యాక్టింగ్, కామెడీ టైమింగ్‌తో స్మాల్ స్క్రీన్ త్రివిక్రమ్‌గా పేరు తెచ్చుకున్న ఆయన షూటింగ్‌లో భాగంగా హైదరాబాద్ ORR గుండా ప్రయాణిస్తుండగా ఆయన గాయపడ్డారు. ఇంతకీ ఆయనకేమైంది? ఆ ప్రముఖ హాస్య నటుడు ఎవరంటే..
జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు ఇళ్లలో మంచి పేరు సంపాదించుకున్న హాస్యనటుడు రాంప్రసాద్. ఆయన గురువారం షూటింగ్ నిమిత్తం తుక్కుగూడ ORR గుండా తన కారులో ప్రయాణిస్తుండంగా ముందు వెళ్తున్న కారు సడెన్ బ్రేక్ వేసింది. దీంతో రాంప్రసాద్ కారు.. ఆ కారుని ఢీ కొట్టింది. వెనుక నుండి వస్తున్న మరో ఆటో కూడా కారుని ఢీ కొట్టడంతో కారు డ్యామేజ్ అయ్యింది. ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే ప్రథమ చికిత్స అందించారు. తర్వాత ఆయన షూటింగ్ లో పాల్గొన్నాడు.