ఫిలిం ఫైనాన్సర్ బంగారు బాబు కొడుకు నిశ్చితార్థం‌లో సెలబ్రిటీల సందడి

ABN , Publish Date - Dec 15 , 2024 | 05:14 PM

ప్రముఖ ఫిలిం ఫైనాన్సర్, ఆర్- సెక్యూర్డ్ ఫైనాన్స్ అధినేత బంగారు బాబు (ఈ.వి. రాజారెడ్డి) చిన్న కుమారుడు క్రాంతి రెడ్డి నిశ్చితార్థ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకకు టాలీవుడ్‌ నుండి ఎందరో సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Cinema Financier Bangaru Babu Son Engagement Ceremony

టాలీవుడ్‌లో ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలకు ఫైనాన్స్ చేసిన ప్రముఖ ఫిలిం ఫైనాన్సర్, ఆర్- సెక్యూర్డ్ ఫైనాన్స్ అధినేత బంగారు బాబు (ఈ.వి. రాజారెడ్డి) చిన్న కుమారుడు క్రాంతి రెడ్డి నిశ్చితార్థ మహోత్సవం.. ప్రముఖ పారిశ్రామికవేత్త సీతా రామిరెడ్డి - రామ సీత దంపతుల కుమార్తె శిరీష‌తో హోటల్ తాజ్ కృష్ణలో ఈరోజు (డిసెంబర్ 15) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులకు అభినందనలు తెలియజేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాతలు, దర్శకులు అందరి తోటి విశేషమైన అనుబంధం కలిగిన బంగారు బాబు కుమారుని నిశ్చితార్థ మహోత్సవానికి చలనచిత్ర ప్రముఖులందరూ తరలి రావడం విశేషం. ఆంధ్రజ్యోతి సంస్థల ఎం.డి. రాధాకృష్ణ ఈ కాబోయే నూతన జంటకు ప్రత్యేకంగా ఆశీస్సులు అందించారు. ఇంకా ఈ కార్యక్రమానికి...

Bangaru-Babu-4.jpg

Also Read- Chiru - Bunny: మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో అల్లు అర్జున్.. పిక్ వైరల్.. ఇక ఫుల్‌స్టాప్ పెట్టినట్టేనా!


Bangaru-Babu-1.jpg

ప్రముఖ నిర్మాతలు కె. ఎస్.రామారావు, సి. కళ్యాణ్, శ్యాం ప్రసాద్ రెడ్డి, పోకూరి బాబురావు, సునీల్ నారంగ్, కె.అచ్చిరెడ్డి, జెమినీ కిరణ్, సాహు గార్లపాటి, డాక్టర్ కే. వెంకటేశ్వరరావు, మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు రవి, ఎర్నేని నవీన్, డి.వి.వి. దానయ్య, బెల్లంకొండ సురేష్, కె రాధా మోహన్, సితార ఎంటర్టైన్మెంట్స్ వంశీ, యువి క్రియేషన్స్ విక్కీ, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ పి.డి. ప్రసాద్, లగడపాటి శ్రీధర్, గోపి ఆచంట.. ప్రముఖ నటులు చక్రపాణి, వడ్డే నవీన్, కిరణ్ అబ్బవరం, నవభారత్ బాలాజీ, మాగంటి సుధాకర్.. ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, ఎస్వీ కృష్ణారెడ్డి, మెహర్ రమేష్, సంపత్ నంది తదితరులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు.


Bangaru-Babu-2.jpg

అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకకు ఇంతమంది సినీ ప్రముఖులు హాజరు కావటం చలనచిత్ర పరిశ్రమలో ఫైనాన్సర్‌గా ‘బంగారు బాబు’కు ఉన్న గుర్తింపు, గౌరవాలకు నిదర్శనం అని హాజరైన ప్రముఖులందరూ అభినందించారు.

Bangaru-Babu-3.jpg

Also Read-Bunny-Balayya: బన్నీకి బాలయ్య ఫోన్..

Also Read-రేలంగి వివాహ ఆహ్వాన పత్రిక: 91 సంవత్సరాల క్రితపు శుభలేఖను చూశారా..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 15 , 2024 | 05:14 PM