Sreeleela: శ్రీలీల‌ బ‌ర్త్‌డే స్పెష‌ల్.. రాబిన్‌హుడ్ నుంచి అదిరిపోయే గ్లిమ్స్‌!

ABN , Publish Date - Jun 14 , 2024 | 12:37 PM

నితిన్ హీరోగా వ‌స్తున్న చిత్రం రాబిన్‌హుడ్. ఈ రోజు (శుక్ర‌వారం) జూన్ 14 శ్రీలీల జ‌న్మ‌దినం సంద‌ర్భంగా చిత్రం నుంచి ఫ‌స్ట్ లుక్ గ్లిమ్స్ వీడియోను విడుద‌ల చేస్తూ శ్రీలీలకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు.

Sreeleela: శ్రీలీల‌ బ‌ర్త్‌డే  స్పెష‌ల్.. రాబిన్‌హుడ్ నుంచి అదిరిపోయే గ్లిమ్స్‌!
sree leela

నితిన్ (nithiin) హీరోగా వెంకీ కుడుముల (Venky Kudumula) ద‌ర్శ‌క‌త్వంలో భీష్మ‌, రంగ్ దే వంటి చిత్రాల త‌ర్వాత ముచ్చ‌ట‌గా మూడోసారి క‌లిసి కొత్త‌గా చేస్తున్న చిత్రం రాబిన్‌హుడ్ (Robinhood). మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మూడు, నాలుగునెల‌ల క్రితం ప్రారంభించిన ఈ చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోండ‌గా క‌థ‌నాయికగా ర‌ష్మిక న‌టిస్తుంద‌ని ప్ర‌క‌టించినా త‌ర్వాత ఆమె స్థానంలో మ‌రో నాయిక చేస్తుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. మ‌ధ్య‌లో రాశీ ఖ‌న్నా, శ్రీలీల (Sreeleela) పేర్లు వినిపించాయి కానీ అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు.

Sreeleela

అయితే ఎట్ట‌కేల‌కు ఆ వార్త‌ల‌కు చెక్ పెట్టారు. ఈ రోజు (శుక్ర‌వారం) జూన్ 14 శ్రీలీల (Sreeleela) జ‌న్మ‌దినం సంద‌ర్భంగా రాబిన్‌హుడ్ (Robinhood) చిత్రం నుంచి ఫ‌స్ట్ లుక్ గ్లిమ్స్ వీడియోను విడుద‌ల చేస్తూ శ్రీలీల (Sreeleela) కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇప్పుడు ఈ వీడియో,ఫొటోలు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి. చేతిలో హ్యాండ్‌బ్యాగ్‌తో, బ్రాండెడ్ గాగుల్స్ ధ‌రించి విమానం దిగి న‌డుస్తూ వెన్నెల కిషోర్‌తో సునామిలో టీ సైలెంట్‌గా ఉండాలి.. నాముందు నువ్వు సైలెంట్‌గా ఉండాలి అంటూ శ్రీల‌ల‌ డైలాగ్ చెబుతూ సాగే గ్లిమ్స్‌ను విడుద‌ల చేశారు. మీరూ ఓ లుక్కేయండి.


ఇదిలాఉండ‌గా డిఫ‌రెంట్ కాన్పెఫ్ట్‌తో ఇంత‌కుముందు క‌నిపించ‌ని పాత్ర‌లో నితిన్ ఈ రాబిన్‌హుడ్ (Robinhood సినిమాలో క‌నిపించ‌నున్నాడు. ఈ చిత్రం కోసం నితిన్ లుక్‌ను ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల ప్రత్యేకంగా మార్చివేస్తున్నట్టుగా స‌మాచారం. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) అత్యంత భారీ బడ్జెట్ తో అత్యున్నత స్థాయి నిర్మాణ, సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాను డిసెంబ‌ర్ 20న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

robinhood.jpg

Updated Date - Jun 14 , 2024 | 12:44 PM