Tirupathi Jaavana: ట్రెండింగ్ స్టార్.. తిరుపతి జావన
ABN , Publish Date - Nov 20 , 2024 | 07:41 PM
ప్రస్తుతం సినిమాలు క్లిక్ అవ్వాలంటే ముందుగా పాటలు అందరినీ ఆకట్టుకోవాల్సి ఉంటుంది. మ్యూజికల్ హిట్ అయితే సినిమా హిట్ అవుతుందని చాలా మంది నమ్ముతుంటారు. అలా ఎన్నో మ్యూజికల్ హిట్ సాంగ్‌లను అందించిన లిరిక్ రైటర్ తిరుపతి జావన.
ప్రస్తుతం సినిమాలు క్లిక్ అవ్వాలంటే ముందుగా పాటలు అందరినీ ఆకట్టుకోవాల్సి ఉంటుంది. మ్యూజికల్ హిట్ అయితే సినిమా హిట్ అవుతుందని చాలా మంది నమ్ముతుంటారు. అలా ఎన్నో మ్యూజికల్ హిట్ సాంగ్‌లను అందించిన లిరిక్ రైటర్ తిరుపతి జావన. శ్రీకాకుళంలోని మారుమూల ప్రాంతంలో పుట్టి.. టాలీవుడ్లో క్రేజీ పాటలను అందిస్తూ అందరినీ అలరిస్తున్నారు.
రీసెంట్ ఛార్ట్ బస్టర్ అయిన ఊరు పేరు భైరవకోనలో 'హమ్మ హమ్మ' అనే పాటను రాశారు. ఈ పాట యూబ్యూబ్‌లో వంద మిలియన్లను క్రాస్ చేసి ట్రెండింగ్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. 'ఊర్వశివో రాక్షసివో', 'ఏబీసీడీ', 'ఇందు వదన', 'జంబలకిడి పంబ' వంటి చిత్రాల్లో ఎన్నో పాటలు రచించారు. మంచి సాహిత్యంతో తెలుగులో తనకంటూ ఓ ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా పాటలు రాయడం ఆయన శైలి.
ఇక తిరుపతి నుంచి నెక్ట్స్ రాబోతోన్న ప్రాజెక్టులు, పాటలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోన్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న ‘భైరవం’, అల్లరి నరేష్ బచ్చలమల్లి వంటి చిత్రాలకు ఆయన పాటల్ని అందిస్తున్నారు.