Vamsee Krishna: ఇంటివాడైన.. టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ద‌ర్శ‌కుడు

ABN , Publish Date - Aug 28 , 2024 | 10:05 PM

తొమ్మిదేండ్ల‌ క్రితం అడ‌వి శేష్, మంచు ల‌క్ష్మి ప్రధాన పాత్ర‌లో వ‌చ్చిన దొంగాట గ‌త సంవ‌త్స‌రం ర‌వితేజ హీరోగా వ‌చ్చిన టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు చిత్రాల‌తో మంచి పేరు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు వంశీ కృష్ణ‌ తాజాగా పెళ్లి పీట‌లు ఎక్కాడు.

vamsee

తొమ్మిదేండ్ల‌ క్రితం అడ‌వి శేష్, మంచు ల‌క్ష్మి ప్రధాన పాత్ర‌లో వ‌చ్చిన చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ఆరంగేట్రం చేశాడు వంశీ కృష్ణ‌ (Vamsee). ఆపై సుమారు ఐదారేండ్ల విరామం త‌ర్వాత ర‌వితేజ హీరోగా వ‌చ్చిన టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు (Tiger nageswara rao) చిత్రానికి ద‌ర్శ‌కత్వం చేయ‌గా ఆ సినిమా మిక్స్‌డ్ టాక్‌తో యావ‌రేజ్ చిత్రంగా నిలిచింది. గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ శిస్యుడిగా ఎంట్రీ ఇచ్చిన ఈ ద‌ర్శ‌కుడు తాజాగా ఆ ద‌ర్శ‌కుడు పెళ్లి పీట‌లు ఎక్కాడు.


Vamsee-Krishna_V_jpg--816x480-4g.webp

బుధవారం ఉదయం ఆయన వివాహం కొంత‌మంది ద‌గ్గ‌రి బంధుమిత్రుల స‌మ‌క్షంలో వేడుకగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లి తంతులో పాల్గొన్నారు. ఈ వేడుక‌కు టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు (Tiger nageswara rao) చిత్ర నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ వివాహానికి హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఒక ఫొటో సోష‌ల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో చాలామంది నెటిజ‌న్లు , ఇండస్ట్రీ ప్రముఖులు, సినీ జనాలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Updated Date - Aug 28 , 2024 | 10:05 PM