Sukumar: ఆర్య టైమ్‌లో సుక్కుని చూశారా.. సుకుమార్ కాదు సుకుమారుడు
ABN , Publish Date - Dec 15 , 2024 | 02:29 PM
ఆర్య టైమ్‌లో సుకుమార్‌ని చూస్తే మీరు కూడా సుకుమార్ కాదు సుకుమారుడు అనే అంటారు..
ప్రస్తుతం 'పుష్ప 2' ఫీవర్ నడుస్తోంది. ఈ మెగా బ్లాక్ బస్టర్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ డైరెక్టర్ సుకుమార్. ఇదే అల్లు అర్జున్‌తో తీసిన ఆర్య మూవీతో ఆయన ఇండస్ట్రీలోకీ ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ ఫిల్మ్ తోనే ఫ్రెష్ సినిమా అనుభవాన్ని అందించి టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. తర్వాత జగడం, ఆర్య 2, 100% లవ్, నాన్నకు ప్రేమతో, 1 నేనొక్కడినే, రంగస్థలం, పుష్ప వంటి సినిమాలతో ఒక దశలో రాజమౌళికే దడ పుట్టించాడు.
అయితే 2004లో రిలీజైన అయినా ఆర్యనే చాలామంది అల్ టైమ్ ఫేవరేట్. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించడంతో పలు చోట్ల సుకుమార్‌ని ఘనంగా సన్మానించారు. అలాగే విజయవాడలో ప్రముఖ రాజకీయనేతలు నేతలు మల్లాది విష్ణు, ఐలాపురం వెంకయ్య, లాయర్ గుప్తా మొదలగు వారు కూడా సన్మానించారు. అప్పటి ఫోటోలు ఇప్పుడు మరోసారి వైరల్‌గా మారాయి. మీరు ఓ లుక్కేయండి.
మంచి గడ్డంతో మ్యాన్లీగా కనిపించే సుకుమార్ ని గడ్డం లేకుండా చూసిన అభిమానులు ఇది సుకుమార్ కాదు సుకుమారుడు అంటూ కామెంట్ చేస్తున్నారు.