Theatres And OTT: థియేటర్‌, ఓటీటీలో వచ్చే వచ్చే సినిమాలు

ABN , Publish Date - Jul 25 , 2024 | 11:59 AM

ప్రభాస్‌ నటించిన 'కల్కి 2898 ఎడి’ హవా థియేటర్స్‌లో ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఈ వారం విడుదలకు కొన్ని చిత్రాలు సిద్ధమైపోయాయి. ఈ శుక్రవారం ధనుష్‌ ‘రాయన్‌’, రాజ్‌ తరుణ్‌ ‘పురుషోత్తముడు’ తదితర చిత్రాలు థియేటర్స్‌లో సందడి చేయనున్నాయి.

ప్రభాస్‌ నటించిన 'కల్కి 2898 ఎడి’ హవా థియేటర్స్‌లో ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఈ వారం విడుదలకు కొన్ని చిత్రాలు సిద్ధమైపోయాయి. ఈ శుక్రవారం ధనుష్‌ ‘రాయన్‌’ (Raayan), రాజ్‌ తరుణ్‌ ‘పురుషోత్తముడు’ (Purushottamudu)తదితర చిత్రాలు థియేటర్స్‌లో సందడి చేయనున్నాయి. ఓటీటీ వేదికగా అలరించడానికి మరికొన్ని చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు రెడీగా ఉన్నాయి. అవేంటో చూద్దాం.

తమిళస్టార్‌ ధనుష్‌ హీరోగా నటించి దర్శకత్వం వహించిన చిత్రం 'రాయన్’. ధనుశ్ దర్శకత్వం వహించిన రెండో చిత్రమిది. యాక్షన్  ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం పోస్టర్‌, ట్రైలర్‌ ఆకట్టుకున్నాయి. దాంతో సినిమాలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అపర్ణా బాలమురళీ, వరలక్ష్మీ శరతకుమార్‌, దుషారా విజయన్, ప్రకాశ్ రాజ్‌, సెల్వరాఘవన్ , సందీప్‌ కిషన్  కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Raayan.jpg

హోల్‌సమ్‌ ఎంటర్‌టైనర్‌..
రాజ్‌తరుణ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం 'పురుషోత్తముడు’. హాసిని సుధీర్‌ కథానాయిక. రామ్‌ భీమన దర్శకత్వంలో రమేష్‌ తేజావత్, ప్రకాష్‌ తేజావత్  నిర్మాణంలో హోల్‌సమ్‌ క్లీన్  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఓటీటీలో...
గెటప్‌ శ్రీను కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం ‘రాజు యాదవ్‌’. అంకిత కారాట్‌ హీరోయిన్‌. కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ సినిమా మేలో థియేటర్లలో సందడి చేసింది. ప్రస్తుతం తెలుగు ఓటీటీ ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్  అవుతోంది. ఇందులో కథానాయకుడు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. ఆ పరిస్థితి ఎందుకొచ్చింది? ప్రేమించిన అమ్మాయి దూరమయ్యాక హీరో లైఫ్‌ ఎలా టర్న్‌ అయింది? అన్నది కథాంశం.

మనోజ్‌ బాజ్‌పాయ్‌ 100వ సినిమా
మనోజ్‌ బాజ్‌పాయ్‌ ప్రధాన పాత్రలో అపూర్వ సింగ్‌ కర్కి దర్శకత్వంలో తెరకెక్కిన హిందీ చిత్రం ‘భయ్యా జీ’  మనోజ్‌ బాజ్‌ నటించిన 100వ సినిమా ఇది. మేలో థియేటర్లలో విడుదలైంది. శుక్రవారం నుంచి ఓటీటీ ‘జీ 5’లో  స్ట్రీమింగ్  కానుంది. తాను అమితంగా ప్రేమించే వారిని దూరం చేసే వ్యక్తులపై హీరో ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడనేదే ఈ సినిమా స్టోరీ.

Manoj.jpg
హారర్‌ థ్రిల్లర్‌
అవికా గోర్‌, వర్థన్‌ పూరి కీలక పాత్రల్లో రూపొందిన హారర్‌ థ్రిల్లర్‌ ‘బ్లడీ ఇష్క్‌’.  విక్రమ్‌ భట్‌ రూపొందించిన ఈ మూవీ నేరుగా ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఈ వారం ఓటీటీ విడుదలయ్యే సినిమాలు, సిరీస్‌లు ఇవే..

నెట్‌ఫ్లిక్స్‌
జులై 25: ది డెకామెరాన్‌ (హాలీవుడ్‌ వెబ్‌సిరీస్‌):
జులై 26:  ఎలైట్‌ సీజన్‌ 8 (హాలీవుడ్‌ వెబ్‌సిరీస్‌)
జులై 26:  అట్లాస్‌ (హాలీవుడ్‌ మూవీ): 
జులై 26:  డ్రాగన్‌ ప్రిన్స్‌ సీజన్‌ 6 (హాలీవుడ్‌ వెబ్‌సిరీస్): 

Bloody.jpg
అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
జులై 25 :  ది మినిస్ట్రీ ఆఫ్‌ అన్‌ జెంటిల్‌మాన్లీ వార్‌ఫేర్‌ (హాలీవుడ్‌): 


ఆహా

యేవమ్‌ (తెలుగు)
జులై 27 : భరతనాట్యం (తెలుగు)

డిస్నీ+హాట్‌స్టార్‌

జులై 26 :  చట్నీ సాంబార్‌ (తమిళ్‌)
జులై 25: ది కర్దాషియన్స్‌ సీజన్‌ 5 (హాలీవుడ్‌ వెబ్‌సిరీస్‌)


బుక్‌ మై షో
జులై 25: వన్‌లైఫ్‌ (హాలీవుడ్‌)


జియో సినిమా
జులై 26:  విచ్‌ బ్రింగ్స్‌ మీ టూ యూ (హాలీవుడ్‌)

Updated Date - Jul 25 , 2024 | 11:59 AM