Theater And OTT: ఈ వారం థియేటర్-ఓటీటీలో సందడి చిన్న చిత్రాలదే!
ABN , Publish Date - Apr 08 , 2024 | 01:50 PM
బాక్సాఫీస్ వద్ద వేసవి వినోదం మొదలైంది. గడిచిన రెండు వారల్లో 'టిల్లు స్వ్కేర్’, 'ఫ్యామిలీస్టార్' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయగా, ఈ వారం పెద్ద చిత్రాల తాకిడి లేక చిన్న చిత్రాలకే పరిమితమైంది.
బాక్సాఫీస్ వద్ద వేసవి వినోదం మొదలైంది. గడిచిన రెండు వారల్లో 'టిల్లు స్వ్కేర్’, 'ఫ్యామిలీస్టార్' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయగా, ఈ వారం పెద్ద చిత్రాల తాకిడి లేక చిన్న చిత్రాలకే పరిమితమైంది. అలాగే ఓటీటీల్లోనూ(OTT) పలు చిత్రాలు సందడి చేయడానికి సిద్థమవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్/ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో చూద్దాం.
భయపెడుతూనే ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన చిత్రం ‘గీతాంజలి’. అంజలి ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాకి సీక్వెల్‌గా ప్రస్తుతం రాబోతున్న చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’(Geethanjali mali vachindi). శ్రీనివాస్ రెడ్డి. సత్యం రాజేశ్, అలీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘గీతాంజలి’ సినిమా ఎక్కడ ముగిసిందో .. అక్కడి నుంచే ఈ సీక్వెల్ మొదలవుతుందని, ఇప్పటి వరకు వచ్చిన హారర్ కామెడీ చిత్రాలన్నింటికీ మించేలా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ఏప్రిల్ 11న ఈ మూవీ విడుదల కానుంది.
భారత ఫుట్‌బాల్ దిగ్గజ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీంగా అజయ్ దేవగణ్ నటిస్తున్న చిత్రం ‘మైదాన్’(maidaan). ప్రియమణి జంటగా కథానాయిక. అమిత్ శర్మ దర్శకత్వంలో. బోనీ కపూర్ నిర్మించారు. ఏప్రిల్ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. ‘మైదానం బయట మీ పదకొండు మంది వేర్వేరు. బరిలోకి దిగాక మీ ఆలోచన.. మీ హృదయం.. మీ వ్యూహం.. మీరు అర్థం చేసుకునే విధానం ఒకేలా ఉండాలి’ అంటూ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపుతున్నారు అజయ్.
యాక్షన్ ప్రియులకు మంచి ట్రీట్ ఇవ్వడానికి సిద్థమవుతున్నారు బాలీవుడ్ కథానాయకులు అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్. వీరిద్దరు కలిసి నటించిన చిత్రం ‘బడేమియా ఛోటేమియా’. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు. జాన్వీ కపూర్, మానుషి చిల్లర్, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 10న ఈ మూవీని థియేటర్‌లలో విడుదల చేస్తున్నారు.
సమాజంలో దాదాపు 95 శాతం మంది ప్రేమకి సంబంధించిన సమస్యల్ని ఎదుర్కొంటుంటారు. వాటికి మా సినిమాలో లవ్ గురు ఎలా పరిష్కారం కనుక్కున్నాడో తెరపై చూసి తెలుసుకోవల్సిందే’’ అంటున్నారు విజయ్ ఆంటోనీ. ఆయన కథానాయకుడిగా నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న చిత్రం ‘లవ్ గురు’. మృణాళిని రవి కథానాయిక. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 11న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్య జంటగా నటించిన కుటుంబ కథా చిత్రం ‘డియర్’. తమిళంలో ఏప్రిల్ 11న విడుదలవుతున్న ఈ చిత్రం ఒక్కరోజు ఆలస్యంగా ఏప్రిల్ 12న తెలుగులోనూ రాబోతోంది. ఆనంద్ రవిచంద్రన్ దర్శకుడు. భార్య గురక పెట్టడం వల్ల ఆ భర్త ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు వారి రిలేషన్‌షిప్ ఎలాంటి సమస్యలకు గురైంది. తదితర విషయాలను వినోదాత్మకంగా చూపించారు. అన్నపూర్ణా స్టూడియోస్, ఏషియన్ సినిమాస్ తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాయి.
Game Changer: రాజమండ్రికి రామ్‌చరణ్..
ఈ వారం ఓటిటి సినిమాలివే
నెట్‌ఫ్లిక్స్
ఏప్రిల్ 10 : అన్‌లాక్డ్ (వెబ్‌సిరీస్)
ఏప్రిల్ 10 : వాట్ జెన్నీఫర్ డిడ్ (ఇంగ్లీష్)
ఏప్రిల్ 11: బేబీ రెయిన్‌డీర్ (హలీవుడ్)
ఏప్రిల్ 11: హార్డ్‌బ్రేక్ హై (వెబ్‌సిరీస్2)
ఏప్రిల్ 12: అమర్‌సింగ్ చమ్కీలా (హిందీ)
అమెజాన్‌ప్రైమ్
ఏప్రిల్ 12 : ఫాలౌట్ (వెబ్‌సిరీస్)
జీ5
ఏప్రిల్ 12 : గామి (తెలుగు) (Gaami ott release)
డిస్నీ+హాట్‌స్టార్
ఏప్రిల్ 10 : బ్లడ్ ఫ్రీ (కొరియన్)
ఏప్రిల్ 12 : ప్రేమలు (మలయాళం)
ఏప్రిల్ 12 : ది గ్రేటెస్ట్ హిట్స్ (హాలీవుడ్)
లయన్స్ గేట్‌ప్లే
ఏప్రిల్ 12 : హైటౌన్ (వెబ్‌సిరీస్)
సోనీలివ్
ఏప్రిల్ 11 : అదృశ్యం (హిందీ సిరీస్)
ఆహా
ఏప్రిల్ 09 : కార్తీక (తెలుగు)
ఏప్రిల్ 12: ప్రేమలు (తెలుగు)
సన్‌నెక్ట్స్
ఏప్రిల్ 12 : లాల్ సలామ్ (తమిళ/తెలుగు)