ఏ సినిమా చూడాలి.. ఈ వారం థియేటర్లలోకి అన్నీ అదిరిపోయే చిత్రాలే!
ABN , Publish Date - Aug 14 , 2024 | 11:35 AM
ఈ వారం సినీ. ప్రేక్షకులను సరిపోను వినోదం దొరకనుంది. తెలుగు నుంచే కాకుండా హిందీ, తమిళ భాషల నుంచి పెద్ద సినిమాలు ఈ గురువారమే థియేటర్లలోకి వస్తుండడంతో రెండు తెలు రాష్ట్రాలలో ఓ మోస్తరు పండుగ వాతావరణమే నెలకొంది.
ఒకటి కాదు రెండు కాదు ఈ వారం థియేటర్లలో సినిమాల దండయాత్ర గట్టిగానే జరుగనుంది. ప్రేక్షకులను సరిపోను వినోదం దొరకనుంది. కేవలం తెలుగు నుంచే కాకుండా హిందీ, తమిళ భాషల నుంచి పెద్ద సినిమాలు ఈ గురువారమే థియేటర్లలోకి వస్తుండడంతో రెండు తెలు రాష్ట్రాలలో ఓ మోస్తరు పండుగ వాతావరణమే నెలకొన్నదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఈ వీకెండ్ వరుస సెలవుల నేపథ్యంలో ఓ ఎనిమిది చిత్రాలు థియేటర్లలోకి వస్తుండగా అందులో పెద్ద స్టార్లు, పెద్ద బ్యానర్ల నుంచి వస్తున్న సినిమాలే కావడం విశేషం.
ప్రధానంగా తెలుగులో రవితేజ హరిశ్ శంకర్ కాంబినేషన్‌లో ముచ్చటగా వస్తున్న మూడో చిత్రం మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan), లైగర్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత ఐస్మార్ట్ శంకర్ కాంబోను రిపీట్ చేస్తూ పూరి జగన్నాథ్, రామ్ కలిసి చేసిన డబుల్ ఐస్మార్ట్ (Double iSmart), తమిళ స్టార్ విక్రమ్ నటించిన పిరియాడికల్ మూవీ తంగలాన్ (Thangalaan), ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్ హీరోగా గీతా ఆర్ట్స్2 బ్యానర్‌లో వస్తున్న ఆయ్ (Aay)సినిమాలపై భారీ అంచనాలున్నాయి. వీటితో పాటు బాలీవుడ స్టార్ జాన్ అబ్రహం హీరోగా రూపొందిన యాక్షన్ చిత్రం వేద (Vedaa) హిందీతో పాటు తెలుగులోనూ భారీ ఎత్తున మన దగ్గర విడుదలవుతుండడం విశేషం.
ఇక తమిళంలో కీర్తి సురేశ్ నటించిన రఘుతాత (Raghu Thatha), దశాబ్దం క్రితం చిన్న చిత్రంగా వచ్చి సంచనల విజయం సాధించిన డిమోంటి కాలనీ సీక్వెల్ డిమోంటి కాలనీ 2 (Demonte Colony 2), డబుల్ ఐస్మార్ట్ (Double iSmart) చిత్రాలు తమిళ నాట విడుదలవుతున్నాయి.
బాలీవుడ్‌లోనూ ఈ వారం 4 చిత్రాలు విడుదలవుతుండగా అందులో పూరి, రామ్ కాండినేషన్ డబుల్ ఐస్మార్ట్ (Double iSmart), అక్షయ్ కుమార్ నటించిన ఖేల్ ఖేల్ మే (Khel Khel Mein), జాన్ అబ్రహం వేద (Vedaa), శ్రద్దా కపూర్ స్త్రీ2 (Stree2) చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
ముఖ్యంగా ఐదు సంవత్సరాల క్రితం చడీ చప్పుడు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన స్త్రీ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న స్త్రీ2 (Stree2) మూవీ ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రికార్డులు తిరగ రాస్తుండడం విశేషం. ఇప్పటికే రూ. 40 కోట్ల మార్కును దాటి సినీ పండితులను అశ్యర్య పరుస్తోంది. ఇలా అన్ని పెద్ద చిత్రాలు ఇకేసారి థియేటర్లకు వస్తుండడం అన్నింటిపై మంచి అంచనాలే ఉండడంతో ప్రేక్షకుల్లో ఏది ఎప్పుడు చూడాలి అనే మీమాంశ ఏర్పడింది. చూడాలి మరి వీటిల్లో ఎన్ని చిత్రాలు సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకుంటాయో, విజయం సాధిస్తాయో.
ఈవారం ఇండియాలో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వస్తున్న సినిమాలివే
Telugu
Aay
Vedaa
Thangalaan
Mr. Bachchan
Double iSmart
Hindi
Stree2
Vedaa
Double iSmart
Khel Khel Mein Vedaa
Tamil
Vedaa
Raghu Thatha
Double iSmart
Demonte Colony 2
Kannada
Gowri
Double iSmart
Krishnam Pranaya Sakhi
Malayalam
Nunakkuzhi
Double iSmart
Vaazha (Biopic of a Billion Boys)