Theme Of Kalki: గూస్‌బ‌మ్స్ తెచ్చేలా.. థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో

ABN , Publish Date - Jun 26 , 2024 | 09:48 AM

మ‌రి కొద్ది గంట‌ల్లో క‌ల్కి 2898 ఏడీ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ క్ర‌మంలో తాజాగా అభిమానుల అనందాన్ని రెట్టింపు చేస్తూ సినిమా నుంచి థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేశారు.

Theme Of Kalki: గూస్‌బ‌మ్స్ తెచ్చేలా.. థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో
kalki

భారీ అంచ‌నాల మ‌ధ్య మ‌రి కొద్ది గంట‌ల్లో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ (Prabhas) న‌టించిన‌ క‌ల్కి 2898 ఏడీ (Kalki2898AD) చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమాపై విప‌రీత‌మైన బ‌జ్ ఏర్ప‌డ‌గా థియేట‌ర్ల వ‌ద్ద అభిమానుల సంబురాలు అంబ‌రాన్ని దాటాయి. దానికి తోడు. ప్ర‌మోష‌న్ కంటెంట్‌తో చిత్ర బృందం ఆ అంచ‌నాల్ని ఎప్ప‌టిక‌ప్పుడు రెట్టింపు చేస్తోంది.

Kalki.jpg

తాజాగా సినిమా యూనిట్‌ థీమ్ ఆఫ్ క‌ల్కి (Theme Of Kalki ) లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేశారు. సంతోష్ నారాయ‌ణ్ (Santhosh Narayanan) స్వ‌ర ప‌ర‌చిన ఈ గీతాన్ని కాల‌భైర‌వ (Kaala Bhairava), అనంత్ (Ananthu), గౌత‌మ్ భ‌ర‌ద్వాజ్ (Gowtham Bharadwaj) రాగ యుక్తంగా, భావోద్వేగంగా ఆల‌పించారు. ఆస్కార్ విజేత చంద్ర‌బోస్ (Chandrabose) త‌న అద్భుత‌మైన సాహిత్యాన్ని అందించారు.


క‌ల్కి 2898 ఏడీ (Kalki2898AD) చిత్ర సారాంశం, పాత్ర‌ల తాలుకూ నేప‌థ్యం, వాటి సంఘ‌ర్ష‌ణ ఇవ‌న్నీ.. చంద్ర‌బోస్ (Chandrabose) త‌న సాహిత్యంలో పొందుప‌రిచిన‌ విధానం శ్రోత‌ల‌ను అబ్బుర ప‌రుస్తోంది. ఇటీవ‌ల ఈ పాట‌ని మ‌ధుర‌లో ఆవిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. శ్రీ‌కృష్ణుడి జ‌న్మ స్థ‌లంలో ఈ పాట ని ప‌రిచ‌యం చేయ‌డం, ఈ పాట‌లో కృష్ణుడి శ‌క్తియుక్తుల్ని అక్ష‌రాలలో మ‌ల‌చ‌డం కాక‌తాళియం కాదు.

Prabhas.jpg

ప్ర‌ముఖ న‌టి, న‌ర్త‌కి శోభ‌నా చంద్ర‌కుమార్ (Shobana) ఈ పాట కోసం గ‌జ్జె క‌ట్ట‌డం వీక్ష‌కుల‌కు మ‌రింత హాయిని క‌లిగించింది. ఆ దృశ్యం క‌నుల పండుగ‌లా క‌నిపించింది. ఈనెల 27న క‌ల్కి 2898 ఏడీ (Kalki2898AD) సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి ఈ చిత్రం సిద్ధ‌మైంది.

Updated Date - Jun 26 , 2024 | 09:48 AM