Tharun Bhascker: కల్ట్ క్లాసిక్ ఈజ్ బ్యాక్.. పకడ్బందీగా ప్లాన్ చేశారు మైక్
ABN , Publish Date - Nov 20 , 2024 | 09:29 AM
తెలుగు యూత్‌ని ఉర్రుతలూగించిన కల్ట్ క్లాసిక్ సినిమా మేకర్స్ నుండి వచ్చిన ఒక సూపర్ డూపర్ అప్డేట్ ఫాన్స్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటంటే..
తరుణ్ భాస్కర్.. టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌లలో ఒకరు కాకపోయినా ఈయన సినిమా వస్తుందంటే చాలు ఒక వర్గంలో ఫస్ట్ షో ఫస్ట్ టికెట్ తెగాల్సిందే. తీసింది తక్కువ సినిమాలే అయినా ఇండస్ట్రీలో మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. టాలీవుడ్‌లో న్యూ లీగ్ డైరెక్టర్‌లలో తరుణ్ భాస్కర్‌ని నంబర్ 1 డైరెక్టర్ అంటారు కొందరు. ఇక ఆయన 2018లో తన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ సినిమా 'ఈ నగరానికి ఏమైంది'. యూత్‌లో సెన్సేషనల్ క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా ఇప్పటికి ట్రెండింగ్‌లోనే ఉంటుంది. అయితే ఈ మూవీ టీమ్ నుండి వచ్చిన ఒక సెన్సేషనల్ అప్డేట్ ప్రస్తుతం యూత్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటంటే..
2016లో తన తొలి సినిమా 'పెళ్లి చూపులు'తోనే జాతీయ అవార్డు సొంతం చేసుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. ఆయన రైటింగ్ కి కేవలం క్రిటిక్స్ మాత్రమే కాదు ఇండస్ట్రీలోని హేమాహేమీలు కూడా ఫిదా అయిపోయారు. ఆ తర్వాత తరుణ్ ఏం ఆకాశంలోకి ఎగరలేదు. తన స్టైల్ లోనే చిన్న ప్రయోగాత్మక, విప్లవాత్మక సినిమాలు తీస్తూ వచ్చారు. 2016లో వచ్చిన 'పెళ్లి చూపులు' మూవీలోని అందరి ఆర్టిస్ట్‌ల కెరీర్‌లకి బ్రేక్ ఇచ్చింది. అలాగే 2018లో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' సినిమా కూడా ఆర్టిస్టులందరి జీవితాన్నే మార్చేసింది. రీసెంట్‌గా వచ్చిన కీడా కోలా అభిమానులని కాస్త నిరాశపరిచిన తరుణ్ ఒక ఎక్సయిటింగ్ అప్డేట్ తో ముందుకొచ్చారు.
అవును, ఈ నగరానికి ఏమైంది సినిమా సెకండ్ పార్ట్ తొందర్లోనే షూరూ కానుంది. ఇది పక్క అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఈ సినిమా 2026లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్‌లో నటించిన విశ్వక్ సేన్, అభినవ్ గోమతం, వెంకటేష్ కాకుమాను, సిమ్రాన్ చౌదరి, అనీషా ఆంబ్రోస్, సుశాంత్ రెడ్డిలు ఈ సినిమాలో కంటిన్యూ కానున్నారు. ఈ సినిమా ఎస్-ఒరిజినల్స్ బ్యానర్‌పై శ్రుజన్ యరబోలు నిర్మిస్తున్నారు.తరుణ్ భాస్కర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన అధికారికంగా వెలువడింది. ఈ సారి కూడా చిత్రానికి రానా దగ్గుబాటి భాగస్వామిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.