TG Vishwa Prasad: ఇష్టపడి సినిమాల్లోకి వచ్చా.. వేరొకరి కష్టాన్ని దోచుకోవాల్సిన అవసరం లేదు

ABN , Publish Date - Feb 09 , 2024 | 11:33 AM

తన ప్రొడక్షన్  హౌస్‌లో జరిగిన అవినీతి చర్యల వల్ల సినిమాలలో క్వాలిటీ ఎలా దెబ్బ తింటుందో, దానిని అరికట్టడానికి ఆయన చేసిన ప్రతి చర్యలేంటో తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్‌. ఆ మాటల్ని వక్రీకరించిన కొందరు పరిశ్రమకు చెందిన వ్యక్తులు టీజీ విశ్వ ప్రసాద్‌పై దుష్ప్రచారం చేస్తున్నారు

TG Vishwa Prasad: ఇష్టపడి సినిమాల్లోకి వచ్చా.. వేరొకరి  కష్టాన్ని దోచుకోవాల్సిన అవసరం లేదు

తన ప్రొడక్షన్  హౌస్‌లో జరిగిన అవినీతి చర్యల వల్ల సినిమాలలో క్వాలిటీ ఎలా దెబ్బ తింటుందో, దానిని అరికట్టడానికి ఆయన చేసిన ప్రతి చర్యలేంటో తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్‌(TG Vishwa prasad) . ఆ మాటల్ని వక్రీకరించిన కొందరు పరిశ్రమకు చెందిన వ్యక్తులు టీజీ విశ్వ ప్రసాద్‌పై దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. "ఈగల్‌ (Eagle) సినిమా ప్రచారంలో భాగంగా ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు బదులుగా, నేను నా ప్రొడక్షన్‌ హౌస్‌లో జరిగిన అవినీతి చర్యల వల్ల సినిమాలతో క్వాలిటీ ఎలా తగ్గుతుందో చెప్పాను. ఆ అవినీతిని అరికట్టే ప్రయత్నంలో నేనెలాంటి ప్రతిచర్యలు చేపట్టాను అన్నది కూడా వివరించాను. దీనికి భుజాలు తడుముకున్న కొందరు పరిశ్రమ వ్యక్తులు నా వ్యాఖ్యల్ని వక్రీకరించి,  నేనేదో కార్మిక సంఘాల సభ్యులను, శ్రామికులను కించపరిచనట్లు క్రియేట్‌ చేశారు. అది నా దృష్టికి వచ్చింది. పరిశ్రమలోని కొందరు వ్యక్తుల అవినీతి వల్ల  కష్టపడి పనిచేేస యూనియన్‌ కార్మికులకే నా డబ్బు అందడం లేదని నేనన్నాను. నా కంపెనీ అంతర్గత వ్యవహారం గురించి నేను చేసిన వ్యాఖ్యలతో బయటి వారికి సంబంధం ఏంటో నాకర్థం కాలేదు. నా సంస్థలో ఎవరికైనా జీతాలు అందకపోతే వారు నేరుగా నాతో మాట్లాడి తీసుకుంటారు. యూనియన్‌కి కంప్లైంట్‌ వస్తే ఛాంబర్‌ లేదా కౌన్సిల్స్‌ ద్వారా సమస్యను పరిష్కరించుకుంటాం. ఇష్టపడి సినిమా వ్యాపారంలోకి వచ్చా. ఇంకొకరి కష్టాన్ని దోచుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా కంపెనీలో అవినీతికి పాల్పడని వారంతా గర్వంగా పని చేయవచ్చు. అవినీతి పరులపై నేను లీగల్‌ యాక్షన్‌ తీసుకోవచ్చు. కానీ నేను వారి కుటుంబాల గురించి ఆలోచించి వారిని వదిలేశాను. అది నా సొంత నిర్ణయం. దానితో బయటి వారికి సంబంధం లేదు. నేను తీసిన ముప్పైకి పైగా సినిమాల్లో మూడు లక్షలకు పైగా కార్మిక సోదరుల కష్టం ఉంది. మరో పాతిక సినిమాలు సెట్‌ మీదకొస్తున్నాయి. నేను యూనియన్‌ వర్కర్స్‌కి వ్యతిరేకం కాదు. వాళ్ల కష్టాన్ని, నా ధనాన్ని దోచుకుంటున్నావారికి మాత్రమే వ్యతిరేకిని’’ అని ఆయన పోస్ట్‌ చేశారు. 


Updated Date - Feb 09 , 2024 | 11:35 AM