Manchu Family Controversy: మంచు మోహన్ బాబు నివాసం వద్ద ఏం జరుగుతోంది..

ABN , Publish Date - Dec 09 , 2024 | 06:34 PM

మంచు మోహన్ బాబు ఇంటి వద్ద ఏం జరుగుతుంది? భారీగా బౌన్సర్స్ చేరుకోవడానికి కారణం ఏమిటి? నిన్నటి నుండి వార్తలలో ఉన్న మంచు ఫ్యామిలీ వివాదానికి తెరపడబోతుందా? మంచు విష్ణు అమెరికా నుండి వస్తున్న నేపథ్యంలో మోహన్ బాబు ఇంటి వద్ద హై టెన్షన్ నెలకొన్నట్లుగా టాక్ వినబడుతోంది. విషయంలోకి వస్తే..

Manchu Mohan Babu and Manchu Manoj

ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వార్తలలో ఉండే మంచు ఫ్యామిలీలో ఇప్పుడు వివాదాలు తారా స్థాయికి చేరాయి. ఆదివారం ఉదయం నుండి మోహన్ బాబు అండ్ ఫ్యామిలీ వార్తలలో నిలుస్తూనే ఉంది. ముందుగా మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య ఘర్షణ జరిగినట్లు ప్రచారం జరిగింది. ఆస్తుల పంపకం విషయంలో ముఖ్యంగా వారు నడుపుతున్న శ్రీవిద్యానికేతన్‌కు సంబంధించి మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య గొడవలు జరిగి, మోహన్ బాబు అనుచరుడు, శ్రీవిద్యానికేతన్‌కి చెందిన వినయ్ అనే అతను తన మందితో మనోజ్‌పై దాడి చేశాడని, స్వయంగా మనోజే మీడియా ముందు చెప్పారు. అక్కడి నుండి ఈ వివాదంపై ఏదో రకంగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

Also Read- Suriya: ‘కంగువా’ నిర్మాతకు భారీ నష్టం.. సూర్య ఏం చేస్తున్నారంటే?

తన తండ్రి తనపై జరిపించిన దాడిలో తనకు గాయాలైనట్లుగా మంచు మనోజ్ చెప్పగా.. ఆ కాసేపటికే కుంటుకుంటూ హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి మంచు మనోజ్ తన భార్యతో కలిసి వెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అయింది. వైద్య పరీక్షల అనంతరం మంచు మనోజ్‌పై దాడి జరిగినట్లుగా వైద్యులు ధృవీకరించినట్లుగా సోమవారం ఓ రిపోర్ట్ వచ్చింది. ఇదిలా ఉంటే.. అమెరికాలో ఉన్న మంచు విష్ణు ఇండియా వస్తున్న నేపథ్యంలో మంచు మోహన్ బాబు ఇంటి వద్ద హడావుడి నెలకొన్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. సోమవారం సాయంత్రం జల్‌పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటికి మంచు విష్ణు వస్తున్న నేపథ్యంలో భారీగా బౌన్సర్ల మోహరించినట్లుగా తెలుస్తోంది.


మంచు మనోజ్ కూడా తన తరపున కొందరు బౌన్సర్లను, ఆళ్లగడ్డ నుంచి మరికొందరిని మోహన్ బాబు ఇంటికి పంపించినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో మోహన్ బాబు ఇంటి వద్ద హై టెన్షన్ నెలకొన్నట్లుగా సమాచారం. ఇంకా మోహన్ బాబుకి మద్దతు కొందరు లేడీ బౌన్సర్లు కూడా ఆయన ఇంటికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. ఈ రాత్రికి మోహన్ బాబు ఇంటి వద్ద పెద్ద గొడవ జరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుండగా.. మరో వైపు ఈ వివాదం సద్దుమణిగేలా చేసేందుకు కొందరు పెద్దలు రంగంలోకి దిగినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read-Manchu Family: మనోజ్ హాస్పిటల్‌ల్లో.. మోహన్ బాబు ట్విట్టర్‌లో.. మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది?

Also Read-Manchu Manoj: హాస్పిటల్‌కు మంచు మనోజ్.. కాళ్లకు బలమైన గాయాలు

Also Read-Allu Arjun: చెప్పను బ్రదర్ టు థ్యాంక్యూ కళ్యాణ్ బాబాయ్.. మీరు మారిపోయారు సార్

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 09 , 2024 | 06:40 PM