Telugu Film Chamber: ఛాంబర్‌ నూతన అధ్యక్షుడిగా భరత్ భూషణ్‌!

ABN , Publish Date - Jul 28 , 2024 | 02:45 PM

తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడిగా  భరత్ భూషణ్‌  ఎన్నికయ్యారు. ఇప్పటివరకూ ఛాంబర్‌ అధ్యక్షుడిగా పని చేసిన దిల్‌రాజు పదవీ కాలం ముగియడంతో ఆదివారం ఎన్నికలు నిర్వహించారు.

తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ (Film Chamber President) అధ్యక్షుడిగా  భరత్ భూషణ్‌ (Bharath Bhushan)  ఎన్నికయ్యారు. ఇప్పటివరకూ ఛాంబర్‌ అధ్యక్షుడిగా పని చేసిన దిల్‌రాజు పదవీ కాలం ముగియడంతో ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్ష పదవికి ఠాగూర్‌ మధు,  భరత్   భూషణ్‌ బరిలో దిగారు. ఉపాధ్య్యక్ష పదవికి అశోక్‌కుమార్‌, వైవీఎస్‌ చౌదరి మధ్య పోటీ జరిగింది. దాదాపు 46 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. అధ్యక్షుడిగా  భరత్ భూషణ్‌, ఉపాధ్యాక్షుడిగా అశోక్‌ కుమార్‌ గెలిచారు.
తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడిగా   భరత్  ఎంపికయ్యారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న దిల్‌ రాజు ఏడాది పదవి కాలం ముగియడంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక జరిగింది. ఆదివారం ఉదయం 11 గంటలకు డిస్ట్రిబ్యూటర్ సెక్టార్‌ నుంచి జరిగిన ఈ ఎన్నికల్లో అధ్యక్ష బరిలో ఠాగూర్‌ మధు,  భరత్ భూషణ్‌  ఉపాధ్యక్ష పదవికి అశోక్‌ కుమార్‌ , వైవీఎస్‌ చౌదరి పోటీ పడగా ప్రొడ్యూసర్స్‌, ఎగ్జిబిటర్స్‌ , డిస్ర్టిబ్యూటర్స్‌, స్టూడియో సెక్టార్‌ లోని 48 మంది సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  

Updated Date - Jul 28 , 2024 | 02:46 PM