Rajamouli OscarAcademy: రాజమౌళి దంపతులకు.. ఆస్కార్ అరుదైన ఆహ్వానం

ABN , Publish Date - Jun 26 , 2024 | 12:04 PM

తెలుగు వారి గౌర‌వం, భార‌తీయ సినిమాను ప్ర‌పంచ ప‌టంలో నిలిపిన ద‌ర్శ‌క ధీరుడు రాజమౌళికి ఓ అరుదైన అవ‌కాశం ల‌భించింది. ఆస్కార్ అకాడమీ కొత్త సభ్యులుగా ఆకాడ‌మీ నుంచి ఆహ్వానం అందుకున్నారు.

Rajamouli OscarAcademy: రాజమౌళి దంపతులకు.. ఆస్కార్ అరుదైన ఆహ్వానం
rajamouli

తెలుగు వారి గౌర‌వం, భార‌తీయ సినిమాను ప్ర‌పంచ ప‌టంలో నిలిపిన ద‌ర్శ‌క ధీరుడు రాజమౌళి (SS Rajamouli). తాజాగా ఆయ‌న‌కు ఓ అరుదైన అవ‌కాశం ల‌భించింది. ఓట్లేసి ఆస్కార్స్ విజేతలను ఎంపిక చేసే ఆస్కార్ అకాడమీ (Oscar Academy) కొత్త సభ్యులుగా ఆహ్వానం అందుకున్నారు.

బాహూబ‌లి చిత్రంతో భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన‌ రాజమౌళి (SS Rajamouli). RRR మూవీతో మరో మెట్టు ఎక్కాడు. అందులో నాటు నాటు పాట‌కు గాను అస్కార్ (Oscar) తెచ్చి పెట్టి అస్కార్ (Oscar) గెలుపొందిన మొదటి భారతీయ సినిమాగా జక్కన్న భార‌తీయుల‌ కలను కూడా సాకారం చేశాడు.

FaMOEvyaMAALiB2.jpeg


అయితే ఈ RRR సినిమా అకాడ‌మీ అవార్డు అందుకున్న నేప‌థ్యంలో ఈ మూవీ టీమ్ సభ్యులైన‌ రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి, చంద్రబోస్ ,సెంథిల్, సాబు శిరిల్ లకు ఆస్కార్ అకాడమీ కొత్త సభ్యులుగా గతేడాది ఆహ్వానం అందుకున్నారు. తాజాగా ఇప్పుడు దర్శకత్వ కేటగిరిలో రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్ జాబితాలో అయన సతీమణి రమా రాజమౌళి (Rama Rajamouli) కూడా ఆహ్వానం అందుకోవడం విశేషం.

మోషన్ పిక్చర్ అండ్ సైన్స్ కేటగిరీలో.. మొత్తం 487 మంది కొత్త సభ్యుల జాబితాను సిద్ధం చేయగా అందులో వీరిద్దరికి కూడా అకాడమీ వారు ఆహ్వానం పలికారు. వీరితో పాటు షబానా ఆజ్మీ , రితేష్ సిద్వానీ , శీతల్ ఆర్మ, రవి వర్మన్, రీమా దాస్, ఆనంద్ కుమార్ టక్కర్, నిషా పహుజా, హేమల్ త్రివేది, గితేష్ పాండ్యాలు ఉన్నారు.

fafd8187-73fe-4afb-b3ba-d16cc588dcb2.jpeg

Updated Date - Jun 26 , 2024 | 12:04 PM