Tollywood:ఈ సమ్మర్‌కి మరింత వేడి!
ABN , Publish Date - Sep 29 , 2024 | 04:50 PM
ఇప్పుడే కాదు ఎప్పట్నుంచో సినిమాలంటేనే తెలుగు వారి సంప్రదాయం. ఒక్క రోజు హాలీడే దొరికినా ఫ్యామిలీతో సినిమాలకెళ్తుంటారు. అలాంటిది పండుగలు, సమ్మర్ సీజనైతే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
ఇప్పుడే కాదు ఎప్పట్నుంచో సినిమాలంటేనే తెలుగు వారి సంప్రదాయం. ఒక్క రోజు హాలీడే దొరికినా (Summer Movies) ఫ్యామిలీతో సినిమాలకెళ్తుంటారు. అలాంటిది పండుగలు, సమ్మర్ సీజనైతే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ రెండు సీజన్లను టార్గెట్ చేసుకొని మరీ బడా హీరోలు, నిర్మాతలు రిలీజ్‌లు ప్లాన్ చేస్తారు. అయితే గత రెండు మూడేళ్ళుగా సమ్మర్‌లో తెలుగు సినిమా హీట్ కనిపించడం లేదు. కానీ.. ఈ సమ్మర్ బడా హీరోలతో పాటు చోటా హీరోలు కూడా బరిలోకి దిగుతుండటంతో ఇప్పుడే వేడి సెగలు మొదలయ్యాయి.
ఈ సమ్మర్ కొంచెం విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఎంట్రీతో కాస్త ఎర్లీగానే స్టార్ట్ అయ్యేలా కనిపిస్తోంది. వరుస ప్లాప్‌లతో సతమతవుతున్న విజయ్ ఈ సారి 'జెర్సీ' డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి 'VD12' (VD12)గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. ఈ మూవీ మార్చి 28న ఫస్ట్ సమ్మర్ మూవీగా రిలీజ్ కానుంది. అయితే రెండేళ్ల తర్వాత తొలిసారి స్క్రీన్ పై కనిపించేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. సరిగ్గా నాలుగేళ్ళ క్రితం క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైన 'హరిహర వీరమల్లు'ను (Hariharaveeramallu) కూడా మార్చి 28నే విడుదల చేయడానికి ప్లాన్ చేయడంతో విజయ్ దేవరకొండ వెనక్కి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 'సలార్', 'కల్కి' సూపర్ హిట్లు కావడంతో ప్రభాస్ తిరిగి ఫామ్ అందుకున్నాడు. ఇదే జోరులో మారుతీ దర్శకత్వంలో చేస్తున్న 'రాజా సాబ్' (the Raja saab) మూవీని ఏప్రిల్ 10న విడుదల చేసి మరో హిట్‌ని ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నాడు. 'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా ఆడియెన్స్ పల్స్ చూసిన హీరో తేజ సజ్జ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ 'మిరాయ్' (Mirai) ప్రభాస్ వచ్చినా పది రోజులకే ఏప్రిల్ 18న రిలీజ్ చేసి అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తున్నాడు.
ఈ వేడి చాలదన్నట్లు మే నెల, పీక్ సమ్మర్లో నిప్పులు చెరేగేందుకు నేచురల్ స్టార్ నాని 'హిట్ 3'తో రానున్నాడు. దీంతో ఎంతలేదన్నా ఈ సమ్మర్‌కి మినిమమ్ 500 కోట్ల బిజినెస్ జరగనుంది. ఎప్పుడు ప్రతి సంక్రాంతికి మెగా వర్సెస్ నందమూరిపై ఫోకస్ చేసే ఫ్యాన్స్‌కి ఈ సారి సమ్మర్ టార్గెట్ కానుంది.