Allu Arjun Episode: అప్పుడు అల్లు అర్జున్.. ఇప్పుడాయన ఫ్యాన్స్

ABN , Publish Date - Dec 18 , 2024 | 12:40 PM

సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం, ఒక రోజు జైలులో ఉంచడం, మధ్యంతర బెయిల్ రావడంతో రిలీజ్ చేయడం వంటి ఎపిసోడ్స్ ముగిసిన అనంతరం ఇప్పుడు పోలీసులు ఆయన ఫ్యాన్స్‌ని టార్గెట్ చేశారు. అసలు విషయం ఏమిటంటే..

Icon Star Allu Arjun

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై అల్లు అర్జున్ మరియు సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని పోలీసులు అరెస్ట్ చేయగా.. నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌తో అల్లు అర్జున్ శనివారం ఉదయం విడుదలయ్యారు. ఇప్పుడీ వివాదంలో మరో ట్విస్ట్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.

Also Read- Upendra: ‘UI ది మూవీ’.. బహుశా ఆ గట్ ఫీలింగ్ తో వెళ్తున్నానేమో


అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో సీఎం రేవంత్ రెడ్డిని దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టిన అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేసినట్లుగా సమాచారం. త‌మ అభిమాన హీరోను అరెస్టు చేయ‌డం ప‌ట్ల తెలంగాణ పోలీసులు, సీఎం రేవంత్ రెడ్డికి వ్య‌తిరేకంగా బ‌న్నీ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అలాంటి అభ్యంత‌ర‌క‌ర పోస్టుల‌పై నిఘా పెట్టిన పోలీసులు.. కాంగ్రెస్ నేత‌లు స‌హా ప‌లువురి ఫిర్యాదు మేర‌కు కేసులు ఫైల్ చేశారు. ముఖ్యంగా ఈ వ్యవహరంలో కీల‌కంగా ఉన్న ప‌లువురు బ‌న్నీ ఫ్యాన్స్‌కు పోలీసులు నోటీసులు జారీ చేసిన‌ట్లు తెలుస్తోంది.


Sandhya-Theaters.jpg

అలా పోస్ట్‌లు పెట్టిన ఫ్యాన్స్‌పై పోలీసులు చ‌ర్య‌లు తీసుకునేందుకు సిద్ధమవడంతో.. ఐకాన్ స్టార్ అభిమానులు ఆగ‌మేఘాల మీద సోష‌ల్ మీడియాలో వారు పెట్టిన పోస్టుల‌ను తొల‌గించే ప‌నిలో ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే.. ఈ వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారనేది అర్థమవుతోంది. ఇప్పటికే అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో పాటు, సంధ్య థియేటర్‌కు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులకు నోటీసులు ఇవ్వడం చూస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు ఈ కేసును ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థమవుతోంది.

Also Read-Malaika Arora: ‘ఇన్నర్ SRK’ని దింపిన మలైకా.. ఐకానిక్ రైలు సీన్‌తో రీల్

Also Read-Rewind 2024: ఈ ఏడాది అగ్ర హీరోల మెరుపులు ఏమాత్రం..

Also Read-రేలంగి వివాహ ఆహ్వాన పత్రిక: 91 సంవత్సరాల క్రితపు శుభలేఖను చూశారా..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 18 , 2024 | 12:40 PM