Teja Sajja: రణ్‌వీర్ సింగ్ 'తేజ సజ్జ'ని ఏమన్నాడో తెలుసా..

ABN , Publish Date - Nov 30 , 2024 | 12:38 PM

హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా వైడ్‌గా ప్రశంసలు అందుకున్న తేజ సజ్జని బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ అన్న మాటలకి తేజ షాక్ అయ్యాడు. ఇంతకీ రణ్‌వీర్ ఏమన్నాడంటే..

బాలీవుడ్ పవర్ హౌస్ 'రణ్‌వీర్ సింగ్'ని గురించి ఎంత చెప్పిన తక్కువే. (You Can Love him or hate him but you can't ignore him) యాక్టింగ్, డాన్సింగ్ క్రాఫ్ట్ ఏదైనా రణ్‌వీర్ తన ఎనర్జీతో కుమ్మిపడేస్తాడు. అదంతా పక్కన పెడితే ఒక హ్యూమన్ బీయింగా ఆయన చాలా ఎమోషనల్, లవ్లీ పర్సన్. ఆయనను ఎవరైనా ప్రేమించాల్సిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ 'తేజ సజ్జ' రణ్‌వీర్ పై తన ప్రేమని పంచుకోకుండా ఆపుకోలేకపోయారు. ఇంతకీ తేజ ఏం చెప్పాడంటే..


హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా నజర్ కొల్లగోట్టిన తేజ సజ్జకిపై అంతటా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బాలీవుడ్ పవర్ హౌస్ రణ్‌వీర్ సింగ్ కూడా తేజని మెచ్చుకున్నారు. ఈ విషయాన్ని ఎంతో ప్రత్యేకంగా తేజ తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. ఆయన రణ్‌వీర్ గురించి రాస్తూ.. " ఈ ఏడాది ముగుస్తుండటంతో నేను అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ మీతో షేర్ చేసుకుంటున్న. నిజానికి ఈ కాంప్లిమెంట్ నాకు ఎంతో పర్సనల్ ఎంతో కాలం నుండి ఇది నా దగ్గరే దాచుకున్న. ఇప్పుడు దాని బయట పెట్టడానికి ఆగలేకపోతున్న. నేను రణవీర్ నుండి బెస్ట్ కాంప్లిమెంట్ అందుకున్న. ఆయన నా వర్క్ గురించి మాట్లాడిన తీరు, ప్రేమగా నాతో మాట్లాడుతూ.. చిన్న చిన్న విషయాలను సైతం ఆయన బ్రేక్ డౌన్ చేస్తూ వివరించారు. ఇది జస్ట్ కాంప్లిమెంట్ కాదు స్వచ్ఛమైన ప్రోత్సాహం, నేరుగా హృదయం నుండి వచ్చింది. దయ, ప్రేమలకు ఆయన ప్రత్యక్ష ఉదాహరణ. నా ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా చేసినందుకు ధన్యవాదాలు భాయ్ Much love always!" అంటూ రాసుకొచ్చారు.


మరోవైపు హనుమాన్ డైరెక్ట‌ర్‌ ప్ర‌శాంత్ వ‌ర్మ.. ర‌ణ‌వీర్ సింగ్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణంలో ప్రారంభించిన ‘రాక్షస్‌’ మూవీ క్రియేటివ్ డిఫరెన్సెస్‌ల కారణంగా ర‌ద్దైంది. ఈ సినిమాని ప్రభాస్ తో 'బ్రహ్మ రాక్షాస్'గా హోంబలే ఫిల్మ్స్ నిర్మాణంలో ప్ర‌శాంత్ వ‌ర్మ తెరకెక్కించడానికి సిద్దమయ్యాడు.

Updated Date - Nov 30 , 2024 | 01:33 PM