Biggboss 8: డబుల్ ఎలిమినేషన్.. వచ్చేవారం కుడా అంతేనేమో!
ABN , Publish Date - Dec 01 , 2024 | 04:26 PM
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 చివరికొచ్చేసింది. గ్రాండ్ ఫినాలే కోసం నువ్వానేనా అన్నట్లు పోటీ జరుగుతోంది. మరోవైపు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనుంది. ఇందులో భాగంగా శనివారం ఎపిసోడ్‌లో టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోయాడు.
బిగ్‌బాస్ (Biggboss8) తెలుగు సీజన్ 8 చివరికొచ్చేసింది. గ్రాండ్ ఫినాలే కోసం నువ్వానేనా అన్నట్లు పోటీ జరుగుతోంది. మరోవైపు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ (Elimination) ఉండనుంది. ఇందులో భాగంగా శనివారం ఎపిసోడ్‌లో టేస్టీ తేజ (Tasty Teja) ఎలిమినేట్ అయిపోయాడు. 35వ రోజు అక్టోబరు 6న వైల్డ్ కార్డ్ ఎంట్రీల్లో ఒకడిగా టేస్టీ తేజ వచ్చాడు. ప్రారంభంలో ఉన్నంతలో బాగానే ఎంటర్‌టైన్ చేశాడు. తర్వాత అరుపులు గొడవలు పెరిగిపోయాయి. దీంతో ఎలిమినేట్ ఖాయం అనుకున్నారంతా. కాకపోతే అలా సేవ్ అయిపోతూ వచ్చాడు. ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్లలో ఒకడిగా బయటకొచ్చేశాడు. ఫ్యామిలీ వీక్ వరకు ఉంటే తన తల్లి వస్తుందని ఆశపడ్డాడు. అనుకున్నట్లే అది నెరవేర్చుకున్నాడు. అలాగే డబుల్ ఎలిమినేషన్‌లో రెండో వ్యక్తిగా పృథ్వీరాజ్ ఎలిమినేట్ అయ్యారని తెలిసింది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూట్ పూర్తయింది. ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో పృథ్వీ బయటకు వచ్చేస్తారు.
మరోవైపు పృథ్వీని (Pruthvi) విష్ణుప్రియ ఇష్టపడంతో ఆమె అభిమానులు అతన్ని నామినేషన్స్ నుంచే సేవ్ చేశారు.ఈసారి విష్ణుప్రియ కూడా నామినేషన్స్‌లో ఉండటంతో ఆమెకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. శనివారం నాటి ఎపిసోడ్‌లో బిగ్ బాస్ మొదటి ఫైనలిస్ట్ అయిన అవినాష్ నామినేషన్స్ నుంచి ేసవ్ అయినట్లు హోస్ట్ నాగార్జున చెప్పారు. డిసెంబర్ 1న ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో మొదటగా గౌతమ్ నామినేషన్స్ నుంచి ేసవ్ అయ్యాడు. ఆ తర్వాత రెండోసారి ప్రేరణ, మూడోసారి నిఖిల్, నాలుగోసారి నబీల్ నబీల్ సేవ్ అయ్యారు. ఇక ఫైనల్‌గా హౌజ్‌లో ప్రేమజంట విష్ణుప్రియ, పృథ్వీ మధ్య ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. దీంట్లో ఎక్కువ ఓట్లతో విష్ణుప్రియ ేసవ్ అయితే.. పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడు.
బిగ్‌బాస్ ఇంట్లో ప్రేమ జంటగా ఉన్న విష్ణుప్రియ, పృథ్వీరాజ్ ఈ ఎలిమినేషన్‌తో విడిపోయింది. ఇకనుంచి విష్ణుప్రియ తన గేమ్‌పైనే ఫోకస్ పెడుతుందో చూడాలి. ఎంత ఫోకస్ పెట్టిన జరగాల్సిన నష్టం జరిగిపోయింది. టైటిల్ విన్నర్ రేస్‌లో ఉండాల్సిన విష్ణుప్రియ అట్టడుగుకు వెళ్లిపోయింది. అయితే, విష్ణుప్రియ ఎంతలా ట్రై చేసిన పృథ్వీ మాత్రం కేవలం ఫ్రెండ్‌ిషిప్‌తోనే దగ్గరయ్యాడు. అది కూడా విష్ణుకు క్లియర్‌గా చెప్పాడు. అయినా విషుప్రియ అతన్ని ఆరాధించడం మానలేదు. బీబీ హోటల్ టాస్క్ సమయంలో అయితే హనీమూన్‌కు వెళ్దామని పృథ్వీరాజ్‌తో విష్ణుప్రియ అంది. ఆ టాస్క్‌లో వారిద్దరు లవర్స్‌గా చేశారు. అందులో భాగంగానే హనీమూన్‌కు వెళ్దామని పృథ్వీతో విష్ణుప్రియ అంది. మొత్తానికి అయితే బిగ్ బాస్ తెలుగు 8 డబుల్ ఎలిమినేషన్‌లో టేస్టీ తేజ, పృథ్వీ ఎలిమినేట్ అయ్యారు. దాంతో ప్రేమజంట విష్ణు, పృథ్వీ విడిపోయినట్లు అయింది. పృథ్వీరాజ్‌ను విష్ణుప్రియ లవ్ చేయడం, కన్నడ బ్యాచ్‌కు నాగార్జున ఫేవరిజం చూపించడంతో ఇన్నాళ్లు ేసవ్ అవుతూ వచ్చాడు. ఇక పృథ్వీరాజ్ ఎదుటివాళ్లను చిన్నచూపు చూస్తు తక్కువ అంచనా వేస్తూ అవమానించేవాడు. నామినేషన్స్‌లో ఇతరులకు ఫిజికల్ స్ర్టెంత్ లేదని, గేమ్స్ ఆడట్లేదని హేళనగా మాట్లాడేవాడు. కానీ, తమను అన్న పృథ్వీపైనే రోహిణి, అవినాష్‌లు ఫిజికల్ టాస్క్‌లు ఆడి గెలిచి అతని పొగరు దించారు.
తేజ రెమ్యునరేషన్...
ఇక 35వ రోజు నుంచి 8 వారాలపాటు హౌస్‌లో ఉన్న తేజ.. ఒక్కో వారానికిగానూ లక్షన్నర అందుకున్నాడట. అంటే 8 వారాలకుగానూ రూ.12 లక్షలు తేజకి రాబోతున్నాయట. ఓ రకంగా చూసుకుంటే తేజకి ఇది మంచి మొత్తమే.