Tamannaah: అప్పట్లోనే హృదయం ముక్కలైంది.. రిలేషన్‌షిప్‌పై స్పందన
ABN , Publish Date - Sep 08 , 2024 | 03:25 PM
మిల్కీబ్యూటీ తమన్నా(Tamannaah) రిలేషన్‌షిప్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తాను కూడా కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కొన్నట్లు తెలిపారు.
మిల్కీబ్యూటీ తమన్నా(Tamannaah) రిలేషన్‌షిప్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తాను కూడా కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. టీనేజ్‌లోనే తొలిసారి ప్రేమలో పడ్డానని.. కొన్ని కారణాలతో అది వర్కౌట్ కాలేదని, తన జీవితంలో రెండు బ్రేకప్స్ ఉన్నాయని వెల్లడించారు. ‘‘ఇప్పటివరకూ రెండుసార్లు నా హృదయం ముక్కలైంది. ఆ సమయంలో నాకెంతో బాధగా అనిపించింది. టీనేజ్‌లో ఉన్నప్పుడే తొలి హార్ట్‌బ్రేక్ ఎదుర్కొన్నాను. ఒక వ్యక్తి కోసం నచ్చిన జీవితాన్ని వదులుకోవడం నాకు నచ్చలేదు. జీవితంలో ఏదో సాధించాలని కొత్త విషయాల గురించి అన్వేషించాలనేది నా భావన. ఆ కారణంతోనే ఆ బంధం నిలబడలేదు. ఆ తర్వాత మరో వ్యక్తితో కొంతకాలం రిలేషన్‌లో ఉన్నా. అయితే.. అతడు నాకు సెట్ కాడనిపించింది. ప్రతి చిన్న విషయానికీ అబద్థం చెప్పేవాళ్లంటే నాకు ఇష్టం ఉండదు. అలాంటి వ్యక్తితో బంధాన్ని కొనసాగిస్తే పమాదం అని అర్థమైంది. అలా అది కూడా ముగిసిపోయింది’’ అని తమన్నా తెలిపారు.
ప్రస్తుతం తమన్నా విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. లస్ట్ స్టోరీస్ 2 సిరీస్‌లో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. త్వరలో ఈ జంట పెళ్లి పీటలెక్కే అవకాశం ఉంది. విజయ్ తనకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని తమన్నా విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం ఆమె దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తున్నారు. ‘స్ర్తీ 2’లో స్పెషల్ సాంగ్ చేశారు. ఆమె కీలక పాత్రలో నటిస్తున్న ‘ఓదెల 2’ చిత్రీకరణ దశలో ఉంది.