Kalyan Ram: కల్యాణ్‌రామ్‌తో సుకుమార్‌ శిష్యుడి సినిమా!

ABN , Publish Date - Aug 27 , 2024 | 07:09 PM

కుమారి 21 ఎఫ్‌’తో దర్శకుడిగా నిరూపించుకున్నారు సూర్య ప్రతాప్‌(Surya pratap). ఇప్పుడు సూర్య ప్రతాప్‌ అమెజాన్‌ ప్రైమ్‌ కోసం ఓ వెబ్‌ సిరీస్‌ రూపొందిస్తున్నారు. ఆ తర్వాత నందమూరి హీరో కల్యాణ్‌ (Kalyanram) రామ్‌తో ఓ సినిమా చేయబోతున్నారని సమాచారం.



'కుమారి 21 ఎఫ్‌’(Kumari 21F) తో దర్శకుడిగా నిరూపించుకున్నారు సూర్య ప్రతాప్‌(Surya pratap). ఈ చిత్రానికి సుకుమార్‌ (Sukumar) కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఆ తరవాత ’18 పేజీస్‌’ చిత్రం కూడా చక్కని విజయం అందుకుంది. ఇప్పుడు సూర్య ప్రతాప్‌ అమెజాన్‌ ప్రైమ్‌ కోసం ఓ వెబ్‌ సిరీస్‌ రూపొందిస్తున్నారు. ఆ తర్వాత నందమూరి హీరో కల్యాణ్‌ (Kalyanram) రామ్‌తో ఓ సినిమా చేయబోతున్నారని సమాచారం. ఇటీవల కల్యాణ్‌రామ్‌కు ఓ కథ వినిపించాడట సూర్య ప్రతాప్‌. ఇది ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లోనే రూపొందించే అవకాశాలున్నాయి. అయితే ఈ సినిమా కథలో సుకుమార్‌ ప్రమేయం ఉందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కల్యాణ్‌ రామ్‌ ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ‘మెరుపు’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉందని టాక్‌. ఇది వరకు రామ్‌ చరణ్‌ ‘మెరుపు’ అనే పేరుతో ఓ ప్రాజెక్ట్‌ మొదలుపెట్టారు. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అప్పటి నుంచి ఆ టైటిల్‌ అలా పెండింగ్‌లోనే ఉంది. ఇప్పుడు కల్యాణ్‌ రామ్‌ సినిమా కోసం ఈ టైటిల్‌ అనుకొంటున్నారు. త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ప్రదీప్‌ సినిమా పూర్తయ్యాక సూర్య ప్రతాప్‌ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కే అవకాశముంది.

Updated Date - Aug 27 , 2024 | 07:10 PM