సురేఖవాణి కుమార్తె సుప్రిత హీరోయిన్ గా సినిమా, హీరో ఎవరంటే...

ABN , Publish Date - Feb 01 , 2024 | 04:12 PM

సామజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటూ రీల్స్, వీడియోలు పెడుతూ చాలా పాపులర్ అయిన సురేఖ వాణి కుమార్తె సుప్రీత ఇప్పుడు కథానాయకురాలిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. ముహూర్తంతో మొదలైన ఈ సినిమాలో కథానాయకుడు ఎవరో తెలుసా...

సురేఖవాణి కుమార్తె సుప్రిత హీరోయిన్ గా సినిమా, హీరో ఎవరంటే...
Surekha Vani's daughter Supritha is making her debut as lead actress

బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లిన వారంతా ఏదోవిధంగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తూ వస్తున్నారు. సోహెల్, అభిజిత్, దివి, స్రవంతి, శివాజీ ఒకరేమిటి ఎంతోమంది బయటకి వచ్చాక తమ కెరీర్ లో బిజీగా వున్నారు. అయితే బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్ళాక వాళ్లకు బాగా పాపులారిటీ వచ్చింది అన్నది నిజం. ఆ పంథాలోనే ఇంకో బిగ్ బాస్ సభ్యుడు అమర్ దీప్ కూడా సినిమా మీద దృష్టి పెట్టాడు. అతని కొత్త సినిమా ఈరోజు ప్రారంభం అయింది. అమర్ దీప్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఎందుకంటే అతను బిగ్ బాస్ ఇంట్లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అతను విజేతగా వస్తాడు అనుకున్నారు కానీ, పల్లవి ప్రశాంత్ గట్టిపోటీ ఇచ్చి విన్నర్ గా అయ్యాడు.

suprithalaunch.jpg

అమర్ దీప్ చాలా సీరియల్స్ చేసాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు, ఇప్పుడు వెండితెర మీద కూడా తన ప్రతిభని కనపరచాలని అనుకున్నాడు. అందుకే అతను కథానాయకుడిగా ఈరోజు ఒక సినిమా ప్రారంభం అయింది. ఈ సినిమాలో కథానాయకురాలు ఎవరో తెలిస్తే షాకవుతారు, ఇంకెవరో కాదు, సామజిక మాధ్యమాల్లో తల్లి సురేఖా వాణి తో సందడి చేస్తూ వున్న సుప్రీతా నాయుడు. ఇంతకు ముందు సుప్రీతా ఒక షార్ట్ ఫిలిం లో నటించింది, ఇప్పుడు కథానాయకురాలిగా ఆరంగేట్రం చేస్తోంది.

supritaactress.jpg

సుప్రీత సామజిక మాధ్యమంలో చాలా చురుకుగా ఉండటమే కాకుండా, అందులో స్టార్ గా ఎదిగింది. తల్లి సురేఖా వాణితో కలిసి ఆమె ఎన్నో రీల్స్, వీడియో లు చేసి పోస్ట్ చేస్తూ ఉంటుంది, అవి బాగా వైరల్ అవుతూ ఉంటాయి కూడా. తల్లీ కూతురు ఇద్దరూ అక్కచెల్లెళ్ళుల్లా గ్లామర్ ఫోజులతో అభిమానులకు కనువిందు చేస్తూ వుంటారు. ఇప్పుడు సుప్రీత ఈ సినిమాతో అమర్ దీప్ పక్కన కథానాయకురాలిగా ఆరంగేట్రం చేస్తోంది. ఈ సినిమాలో ఇంకా సీనియర్ నటుడు వినోద్ కుమార్, రాజా రవీంద్ర, ఎస్తర్ లు కూడా నటిస్తున్నారు.

సురేఖావాణి తన ఇన్‌స్టాగ్రామ్ లో కూతురికి శుభాకాంక్షలు చెపుతూ ఒక స్టోరీ పెట్టారు. అందులో అమర్ దీప్, సుప్రీతా కలిసి వున్న ఫోటో పెట్టి కంగ్రాట్స్ ప్రిన్సెస్ అంటూ తన కుమార్తెకి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Feb 01 , 2024 | 04:12 PM