Chiranjeevi - Surekha: ప్రజల ఆకాంక్షల్ని నిజం చేస్తావని ఆశిస్తూ, ఆశ్వీర్వదిస్తూ.. 

ABN , Publish Date - Jun 15 , 2024 | 06:17 PM

ఆంధ్రప్రదేశ్  ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్‌కు (AP Deputy cm) తన వదిన సురేఖ (Surekha konidela) మోంట్‌ బ్లాంక్‌ పెన్నును బహుకరించారు. ఈ వీడియోను చిరంజీవి ట్విట్టర్‌లో షేర్‌ చేసి

Chiranjeevi - Surekha: ప్రజల ఆకాంక్షల్ని నిజం చేస్తావని ఆశిస్తూ, ఆశ్వీర్వదిస్తూ.. 

ఆంధ్రప్రదేశ్  ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్‌కు (AP Deputy cm) తన వదిన సురేఖ (Surekha konidela) మోంట్‌ బ్లాంక్‌ పెన్నును బహుకరించారు. ఈ వీడియోను చిరంజీవి ట్విట్టర్‌లో షేర్‌ చేసి "కల్యాణ్‌ బాబుకు (Pawan kalyan) వదినమ్మ బహుమతి’ అని రాసుకొచ్చారు. ఈ మేరకు విడుదల చేసిన వీడియోలో ''తెలుగు ప్రజల ఆకాంక్షల్ని, నిజం చేస్తావని, ఆశిస్తూ, ఆశ్వీర్వదిస్తూ మీ వదిన, అన్నయ్య’ (Chiranjeevi)అని పేర్కొన్నారు. ఆన్ లైన్ లో ఆ పెన్ను ఖరీదు రూ.8000గా ఉంది. పవన్‌ తన ప్రమాణ స్వీకారం సమయంలో పది రూపాయల బాల్‌ పాయింట్‌ పెన్‌తో సంతకం చేశారు. అది హౌసర్‌ కంపెనీకి చెందిన పెన్నుగా గమనించి అప్పటినుంచి పవన్‌ ఫ్యాన్స్‌ ఆ పెన్నునే వాడుతున్నారు. (Surekha Gift ro Pawan kalyan)

Pawan kalyan.jpeg


ఆంధ్రప్రదేశ్ లో  జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ పిఠాపురం ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. జనసేన పోటీ చేసిన 21 ఎమ్మెల్యే స్థానాలు, రెండు ఎంపీ స్థానాల్లో పూర్తిస్థాయిలో గెలుపొంది చరిత్ర సృష్టించారు. ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డిప్యూటీ సీఎంతోపాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృది, అటవీ, పర్యావరణం, సైన్స్  అండ్‌ టెక్నాలజీ వంటి శాఖలను కేటాయించారు. ప్రస్తుతం ఆయన అభిమానులు, జనసైనికులు, నెటిజన్లు జనసేనాని పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ మేరకు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సినీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Madu.jpg

Updated Date - Jun 15 , 2024 | 06:22 PM