Jani Master: జానీ మాస్టర్‌కి సపోర్ట్‌గా ఆర్టిస్ట్స్
ABN , Publish Date - Oct 06 , 2024 | 04:20 PM
ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం జానీపై ఉన్న ఆరోపణల రీత్యా అవార్డును నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఖంగుతిన్న జానీ మాస్టర్‌కి తోటి ఆర్టిస్ట్స్ మద్దతు తెలుపుతున్నారు. ఇంతకీ వాళ్ళు ఎవరంటే..
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ (Jani master) మాస్టర్‌ని అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడి ఆరోపణల మేరకు గత నెలలో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో వరుస ట్విస్టులతో జానీకి చుక్కెదురవుతుంది. అయితే జానీ కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన తిరుచిట్రంబలంనికి గాను కేంద్ర ప్రభుత్వం ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ఆయనకు అవార్డు ప్రకటించింది. ఈ నెల 8న ఆయన అవార్డు తీసుకోవాల్సి ఉంది. ఈ మేరకు ఆయన మధ్యంతర బెయిల్ కోసం అప్లై చేయగా కోర్ట్ అంగీకరించింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం జానీపై ఉన్న ఆరోపణల రీత్యా అవార్డును నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఖంగుతిన్న జానీ మాస్టర్‌కి తోటి ఆర్టిస్ట్స్ మద్దతు తెలుపుతున్నారు. ఇంతకీ వాళ్ళు ఎవరంటే..
ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లోని మరో కొరియోగ్రాఫర్ ఆట సందీప్ మద్దతు తెలిపారు. తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా జానీ మాస్టర్‌కి అవార్డు ని నిలిపేయడంతో అసహనం వ్యక్తం చేస్తూ ఓ వీడియో చేశాడు. తన భార్యతో కలిసి చేసిన ఆ వీడియోలో సందీప్ మాట్లాడుతూ.. ఒక కళాకారుడు ఎంత కష్టపడితే గాని జాతీయ అవార్డు రాదు. ఇప్పుడు ఆయన కృషి, శ్రమ మొత్తం బూడిదలో పోసిన పన్నీరులా అయ్యిందన్నారు. అలాగే సదరు అమ్మాయి నా ఈవెంట్స్ కిన్ కూడా పని చేశారని చెప్పారు. కాగా మరికొన్ని ఈవెంట్స్‌కి పిలవగా తాను జానీ మాస్టర్ వద్ద పని చేస్తున్నని, అక్కడే పని చేస్తానని చెప్పింది అని తెలిపాడు. అలాగే ఈ మధ్యలో చట్టాలు అమ్మయిలకు అనుకూలంగా మారాయని దీని వల్లే అందరు మగోళ్ళపై రెచ్చిపోయి అన్యాయంగా కేసు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్‌కి అనీ మాస్టర్ స్పందిస్తూ.. 'థాంక్ గాడ్ ఫైనల్ గా ఒక్కరు బయటకొచ్చి మాట్లాడుతున్నారు.. నా మనుసులో కూడా ఇదే ఉంది' అంటూ మద్దతు తెలిపింది.