Sundeep Kishan: త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో..
ABN , Publish Date - Feb 22 , 2024 | 12:50 PM
'ధమాకా’ చిత్రం తర్వాత దర్శకుడు త్రినాథరావు నక్కిన నుంచి కొత్త సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఈ గ్యాప్‌లో ఆయన నిర్మాతగా మారి నక్కిన నెరేటివ్ అనే బ్యానర్ స్థాపించారు.

'ధమాకా’ (Dhamaka) చిత్రం తర్వాత దర్శకుడు త్రినాథరావు నక్కిన (Trinadha Rao Nakkina) నుంచి కొత్త సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఈ గ్యాప్‌లో ఆయన నిర్మాతగా మారి నక్కిన నెరేటివ్ అనే బ్యానర్ స్థాపించారు. కొత్తవారితో 'చౌర్యపాఠం’ అనే సినిమా నిర్మించారు. తాజా సమాచారం ప్రకారం ఆయన మళ్ళీ మెగాఫోన్ పట్టుకోవడానికి రెడీ అయ్యారు. ఇటీవల 'ఊరు పేరు భైరవకోన’ చిత్రంతో విజయం అందుకున్న సందీప్ కిషన్‌తో (Sundeep kishan) త్రినాధరావు ఓ సినిమా చేయబోతున్నారని, ఇదొక కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది.
ఈ చిత్రానికి ‘ఓరి నాయనో ‘అనే పేరును పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 'ధమాకా’కి మాస్ పాటలు ఇచ్చిన భీమ్స్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు. శ్యామ్ కె నాయుడు డీవోపీ. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్, సామజవరగమన తీసిన హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.