Suma Kanakala: సుమ పోస్టు చూశారా.. దీని వెనుక ఆంతర్యమేమిటి
ABN , Publish Date - Nov 30 , 2024 | 04:24 PM
ప్రస్తుతం సోషల్ మీడియాలో యాంకర్ సుమ పోస్ట్ వైరల్‌గా మారింది. ఇంతకీ ఆమె ఏం పోస్ట్ చేసిందంటే..
తన యాంకరింగ్‌తో స్టేడియంలో ఉన్న ఆడియెన్స్‌నే కాకుండా.. ఆట ఆడే ఆటగాళ్లను సైతం ఆకట్టుకోగల నైపుణ్యం సుమ సొంతం. ఆమె లేకుండా స్టార్ హీరోలు తమ సినిమాలకు సంబంధించి ప్రీ రిలీజ్ వేడుకలను కూడా నిర్వహించరు. సుమ (Suma kanakala) ఉంటేనే, సుమ వచ్చాకే ప్రీ రిలీజ్ వేడుక (Pre Release Event) నిర్వహించుకుందాం అనేంత క్రేజ్‌ని, నేమ్‌ని సుమ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండే ఆమె తాజాగా ఓ పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్ గా మారింది. ఇంతకీ సుమ ఏం పోస్ట్ చేసిందంటే..
మరోసారి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం పుష్ప మేనియా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే యాంకర్ సుమ 🖐️🪓🔥 ఎమోజిలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీంతో సుమ 'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనుందా ఆమె టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పాట్నా, చెన్నై, కొచ్చిలలో మేసివ్ ఈవెంట్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన పుష్ప టీమ్ నెక్స్ట్ హైదరాబాద్ లో ఈవెంట్ ప్లాన్ చేయనున్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ ని త్వరలోనే యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్నారు. ఇంకా ముంబై, కోల్ కత్తా లలో ఈవెంట్స్ నిర్వహించాల్సి ఉంది.
Also Read-RC 16: చరణ్ వర్సెస్ మున్నా భయ్యా.. మీర్జాపూర్
ఈ సినిమా డిసెంబర్ 5న విడుదలకు సిద్థమైన సంగతి తెలిసిందే. ‘తగ్గేదేలే’ అన్నట్లు 3 గంటలా 20 నిమిషాల38 సెకన్ల నిడివితో ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. సెన్సార్ సర్టిఫికెట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్‌లో మొత్తం ఐదు విషయాల్లో మార్పు చేర్పులు చెప్పింది. ‘రండి’ అనే పదాన్ని మరొక పదంతో మార్చగా, మరో అసభ్య పదాన్ని మ్యూట్ చేయమని సూచించింది. ఇక వెంకటేశ్వర్ అనే మాటను భగవంతుడుగా మార్చమన్నది. విలన్ కాలుని హీరో నరకగా అది గాలిలో ఎగిరే సీన్, నరికిన చేతిని హీరో పట్టుకునే సన్నివేశాలను సీజీతో కవర్ చేయమని చెప్పింది.
-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి