Sudheer Babu: ప్రభాస్‌పై అర్షద్‌ కామెంట్స్‌.. సుధీర్‌బాబు రియాక్షన్

ABN , Publish Date - Aug 20 , 2024 | 04:36 PM

‘కల్కి 2898 ఎడీ’(Kalki 2898 Ad) లోని ప్రభాస్‌ లుక్‌పై బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ (arshad warsi) వార్సీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. దీనిపై ఎంతో మంది స్టార్స్‌, అభిమానులు అర్షద్‌ వార్సీపై మండిపడ్డారు.

‘కల్కి 2898 ఎడీ’(Kalki 2898 Ad) లోని ప్రభాస్‌ లుక్‌పై బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ (arshad warsi) వార్సీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. దీనిపై ఎంతో మంది స్టార్స్‌, అభిమానులు అర్షద్‌ వార్సీపై మండిపడ్డారు. తాజాగా ఈ వియయంపై టాలీవుడ్‌ యాక్టర్‌ సుధీర్‌ బాబు (sudheer babu) స్పందించారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ‘‘నిర్మాణాత్మకంగా విమర్శిస్తే ఫర్వాలేదు. కానీ, చులకనగా మాట్లాడడం సరికాదు. ప్రొఫెషనలిజం లేని ఇలాంటి కామెంట్స్‌ వార్సీ నుంచి వస్తాయని ఊహించలేదు. ప్రభాస్‌ స్థాయి చాలా పెద్దది. కుంచిత మనస్తత్వంతో చేేస వ్యాఖ్యలను పట్టించుకోరు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు సుధీర్‌బాబు. పాన ఇండియా స్థాయిలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందిన కల్కిలో ప్రభాస్‌ పాత్ర జోకర్‌లా ఉందంటూ అర్షద్‌ చేసిన విమర్శలు వైరల్‌ అయ్యాయి.  అమితాబ్‌ బచ్చన్‌  పాత్రతో పోలిస్తే ప్రభాస్‌ పాత్ర అంతగా ఏమీలేదన్నారు. ప్రభాస్‌ను తెరపై చూస్తున్నప్పుడు బాధగా అనిపించిందని చెప్పారు అర్షద్‌ వార్సీ.. ఈ వ్యాఖ్యలపై నెట్టింట ప్రభాస్‌ అభిమానులు మండిపడుతున్నారు. సినీ ప్రముఖులు  రియాక్ట్‌ అవుతున్నారు. ఇప్పటికే నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌, ఎస్‌కెఎన్  తదితరులు స్పందించారు.  ప్రపంచ స్థ్థాయికి ఇండియన్‌ సినిమాని తీసుకెళ్లేందుకు ఏదైనా చేయగలిగిన వ్యక్తి ప్రభాస్‌ అని దర్శకుడు అజయ్‌ భూపతి పేర్కొన్నారు. బాలీవుడ్‌ వాళ్లు కేవలం అసూయతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. 

Updated Date - Aug 20 , 2024 | 04:36 PM