Pushpa 2: పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్టార్స్ మిస్సింగ్..
ABN , Publish Date - Dec 03 , 2024 | 02:46 PM
'పుష్ప 2' వైల్డ్ ఫైర్ జాతరలో సినిమాలోని కీలక నటీనటుమణులు హాజరు కాకపోవడం కొత్త చర్చకు తీస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియన్ మూవీ 'పుష్ప 2' డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా పలు నగరాల్లో హ్యూజ్ ఈవెంట్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో వైల్డ్ ఫైర్ జాతర పేరుతో ఈవెంట్ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి ఎస్.ఎస్.రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు యంగ్ డైరెక్టర్స్ వివేక్ ఆత్రేయ, శివ నిర్వాణ, గోపీచంద్ మలినేని, బుచ్చి బాబుతో పాటు మెయిన్ కాస్ట్ హాజరయ్యారు. మరి ఈ సినిమాలోని సపోర్టింగ్ కాస్ట్ నుండి ఒక్క అనసూయ తప్ప ఎవరు హాజరు కాలేదు. దీంతో ఇది సినీ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసింది.
ఈ ఈవెంట్ కి ఫిల్మ్ మెయిన్ కాస్ట్ అల్లు అర్జున్, రష్మిక మందన్న తో పాటు 'కిస్సిక్' గర్ల్ శ్రీలీల, దాక్ష్యాయనిగా నటించిన అనసూయ మాత్రమే హాజరయ్యారు. మెయిన్ విలన్ రోల్ లో నటించిన ఫహద్ ఫాసిల్ తో పాటు రావు రమేష్, సునీల్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, అజయ్ ఘోష్, ధనుంజయ, అజయ్, బ్రహ్మాజీ, ఆదిత్య మీనన్, జగదీశ్ ప్రతాప్ బండారిలతో సహా ఎవరు హాజరు కాలేదు. అయితే ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో తాము భాగమే అని చెప్పుకోవడానికి వాళ్ళకి ఇష్టం ఉంటుంది. మరి ఎందుకు హాజరు కాలేదు? నిర్మాతలు ఆహ్వానం అందించలేదా? ఒకవేళ ఆహ్వానించకపోతే, ఎందుకు ఆహ్వానించలేదు అనే చర్చ మొదలైంది. కేవలం బన్నీనే ఈవెంట్ కి హైలెట్ చేద్దాం అనుకున్నారా అనే అనుమానాలు లేవనెత్తుతున్నారు.
ఇక ఫహద్ విషయానికొస్తే ఆయన కంట్రీలోనే మోస్ట్ బిజీ స్టార్ ఆయన రాలేదు అంటే ఒక అర్థం ఉంటుంది. ఆయన కొచ్చిన్ మీటింగ్ లో కూడా కనపడకపోవడం గమనార్హం. ఇక సినిమాలో భాగమైన మెయిన్ టెక్నీషియన్స్‌లలో కొందరు ఈవెంట్‌కి హాజరైన స్పీచ్‌లు ఇచ్చేందుకు సమయం సరిపోకవడం ఫ్యాన్స్‌ని నిరాశకి గురి చేసింది. లిరిసిస్ట్, రైటర్స్ చంద్రబోస్, భాస్కర భట్ల హాజరైన స్పీచ్ ఇవ్వలేకపోయారు. ఇక బన్నీ సినిమాలో కొరియోగ్రాఫర్ ల ఊసే లేకపోవడం విశేషం.