SS Rajamouli: లంచ్ కొస్తావా అంటూ స్టెప్పులేసిన రాజమౌళి..

ABN , Publish Date - Dec 14 , 2024 | 06:00 PM

ప్రపంచస్థాయి చిత్రాలు చెక్కే జక్కన డ్యాన్స్ స్టెప్పులు చూసారా..

ఇండియన్ సినిమా స్టాండర్డ్స్‌ని అమాంతం పెంచేసిన స్టార్ డైరెక్టర్ రాజమౌళి తనలోని మరో కోణాన్ని చూపించారు. ఎప్పుడు సినిమా పనుల్లో బిజీగా ఉండే ఆయన ఫ్యామిలీతో కూడా క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తారు. తాజాగా ఆయన 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' మూవీలోని లంచ్ కొస్తావా పాటకి స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. ఫ్యామిలీకి సంబంధించిన ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో ఈ డ్యాన్స్ చేసినట్లు తెలుస్తుంది. ఇది కీరవాణి కొడుకు శ్రీ సింహ పెళ్లికి సంబంధించిన ప్రైవేట్ కార్యక్రమం అనే టాక్ వినిపిస్తుంది.


మరోవైపు మహేశ్‌బాబు హీరోగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ఓ యాక్షన్‌ అడ్వెంచర్‌ సినిమా పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రబృందం దృష్టి అంతా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులపైనే ఉంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోందని టాక్‌. అయితే ఈ చిత్రం గురించి ఇప్పటిదాకా ఏ విషయం అఫీషియల్‌గా బయటకు రాలేదు.


ఎస్‌ఎస్‌ఎంబీ 29 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మహేశ్‌ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఆ పాత్ర ఇప్పటికే సన్నద్థమయ్యారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం రాజమౌళి ఏఐ టెక్నాలజీని వినియోగించనున్నట్లు వార్త?ని వినిపించాయి. దీనికోసం ఆయన ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు తెగ వైరలైంది. సినిమాలోని కొన్ని పాత్రలు, జంతువుల కోసం ఆయన ఏఐ టెక్నాలజీని ఉపయోగించనున్నారని తెలుస్తోంది. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ దీనిని అనువదించనున్నారు. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్‌.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Updated Date - Dec 14 , 2024 | 06:06 PM