SSMB29: రాజమౌళి సర్‌ప్రైజ్‌ అలా ప్లాన్  చేశారట!

ABN , Publish Date - Jul 07 , 2024 | 08:28 PM

'గుంటూరు కారం’ చిత్రం తర్వాత మహేష్‌ బాబు (Mahesh Babu) తదుపరి చిత్రం అప్‌డేట్‌ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో రాబోతున్న 'ఎస్‌ఎస్‌ఎంబీ29’ (SSMB29) ప్రీ ప్రొడక్షన్  మినహా ఏ అప్‌డేట్‌ రాలేదు.

'గుంటూరు కారం’ చిత్రం తర్వాత మహేష్‌ బాబు (Mahesh Babu) తదుపరి చిత్రం అప్‌డేట్‌ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో రాబోతున్న 'ఎస్‌ఎస్‌ఎంబీ29’ (SSMB29) ప్రీ ప్రొడక్షన్  మినహా ఏ అప్‌డేట్‌ రాలేదు.  అసలు ఆ సినిమా ఎప్పుడు మొదలుపెడతారు. ఎప్పుడు పూర్తి చేసి విడుదల చేస్తారనే విషయాలను రాజమౌళి  ఇప్పటిదాకా వెల్లడించలేదు. హీరో మహేష్‌ అనే విషయం తప్ప మరో అప్‌డేట్‌ లేదు. సినిమాపై వస్తున్న రూమర్స్‌నే అప్‌డేట్‌గా భావిస్తున్నారు అభిమానులు. ఈ విషయాల్లో మహేష్‌ ఫ్యాన్స్‌లో అసంతృప్తి రోజు రోజుకీ పెరుగుతోంది. (Mahesh Birthday spl)

అయితే ఈ నిరీక్షణకు ఆగస్ట్‌ 9న ఫుల్‌స్టాప్‌ పడటం ఖాయమని తెలుస్తోంది. ఆరోజు మహేష్‌ పుట్టిన రోజు. అభిమానులు బర్త్‌డే గిఫ్ట్‌గా మహేష్‌ - రాజమౌళి సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌ రావడం పక్కా అని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి ఓ కాన్సెప్ట్‌ వీడియో విడుదల చేసే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఆ కాన్సెప్ట్‌ వీడియో విడుదల చేసి, ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించాలని జక్కన్న భావిస్తున్నారట.. దానికి ఆగస్టు 9 ముహూర్తంగా నిర్ణయించినట్టు సమాచారం. సాధారణంగా రాజమౌళి సినిమా ప్రారంభించే ముందు ప్రెస్‌ మీట్‌ నిర్వహించి దానికి సంబంధించిన కీలకమైన విషయాలు వెల్లడించడం అలవాటు. ఆగస్టు 9కి ముందే.. ఆ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని, కాన్సెప్ట్‌ వీడియో మాత్రం ఆగస్టు 9న విడుదల చేస్తారని సమాచారం. 

Updated Date - Jul 07 , 2024 | 08:28 PM