Modern Masters : రాజమౌళి డాక్యుమెంటరీ.. ఎలా ఉండబోతోందంటే..

ABN , Publish Date - Jul 22 , 2024 | 02:14 PM

టాలీవుడ్‌ అగ్ర దర్శకుడు రాజమౌళిపై (Rajamouli) ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ (Modern Masters) పేరుతో డాక్యుమెంటరీ రూపొందించింది. ఇందులో ఆయన సినీ ప్రయాణాన్ని చూపించనున్నారు.

టాలీవుడ్‌ అగ్ర దర్శకుడు రాజమౌళిపై (Rajamouli) ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ (Modern Masters) పేరుతో డాక్యుమెంటరీ రూపొందించింది. ఇందులో ఆయన సినీ ప్రయాణాన్ని చూపించనున్నారు. ఆగస్టు 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఇది  స్ట్రీమింగ్ కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ట్రెలర్‌ను విడుదల చేయగా అది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందులో టాలీవుడ్‌, బాలీవుడ్‌, హాలీవుడ్‌ సినీ ప్రముఖులు రాజమౌళిపై వారి అభిప్రాయాలను పంచుకున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, ప్రభాస్‌లతోపాటు హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌, బాలీవుడ్‌ దర్శకనిర్మాత కరణ్‌ జోహర్‌లు కూడా వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. (Modern Masters On Netflix)


ఇలాంటి దర్శకుడిని నేను ఇప్పటివరకు చూడలేదు. సినిమాలంటే ఆయనకు పిచ్చి ప్రేమ - ప్రభాస్‌.


ఆయన సినిమాల్లో నన్ను నేను చూసుకొని ఎంతో ఆశ్చర్యపోతాను
- రామ్‌చరణ్‌


ఇప్పటివరకు ఎవరూ చూపించని కథలను ప్రపంచానికి చెప్పడం కోసమే రాజమౌళి జన్మించారు - ఎన్టీఆర్‌


రాజమౌళికి సాధ్యం కానిది ఏదీ లేదు. ఎవరితోనైనా పని చేయగలరు. ఆయనంటే నాకెంతో గౌరవం - జేమ్స్‌ కామెరూన్‌

రాజమౌళితో పని చేసిన వారందరూ ఆయన్ని పని రాక్షసుడని పిలుస్తుంటారు - రమా రాజమౌళి


ఈ దర్శకుడు ఓ లెజెండ్‌ - కరణ్‌ జోహార్‌

Updated Date - Jul 22 , 2024 | 09:18 PM