SS Rajamouli - Modern Masters: రాజమౌళి బయోపిక్‌.. ఎప్పుడు.. ఎక్కడంటే!

ABN , Publish Date - Jul 06 , 2024 | 11:13 AM

దర్శకధీరుడు రాజమౌళి(SS Rajamouli).. టాలీవుడ్‌కి ఓ బ్రాండ్‌. పరాజయంతో పరిచయం లేని దర్శకుడు. 23 ఏళ్ల సినీ కెరీర్‌లో ఆయన తీసింది 12 చిత్రాలే అయినా అనుభవం అంతకు రెట్టింపు.

దర్శకధీరుడు రాజమౌళి(SS Rajamouli).. టాలీవుడ్‌కి ఓ బ్రాండ్‌. పరాజయంతో పరిచయం లేని దర్శకుడు. 23 ఏళ్ల సినీ కెరీర్‌లో ఆయన తీసింది 12 చిత్రాలే అయినా అనుభవం అంతకు రెట్టింపు. ఆయన తీసిన ఒక్కో సినిమా ఒక్కో జానర్‌. 'బాహుబలి’తో ఆయన స్టార్‌డమ్‌ పాన్  ఇండియాను దాటేసింది. 'ఆర్‌ఆఆర్‌ఆర్‌'తో (RRR) పాన్  వరల్డ్‌ దృష్టి కూడా ఆయన మీద పడేలా చేశారు జక్కన్న. తెలుగు సినిమాకు ఆస్కార్‌ వైభవాన్ని తీసుకొచ్చిన ఘనత ఆయనది. వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తీయడమే కాదు, వేల కోట్లు వసూళ్లు రాబట్టే ఫార్ములా తెలిసిన దర్శకుడు. ప్రపంచ వ్యాప్తంగా ఆయన గురించి తెలుసుకోవాలనే తపన సినీ ప్రియులకు ఉంటుంది. అందుకే ఆయన జీవితం ఇప్పుడు తెరపైకి రాబోతుంది. రాజమౌళి బయోపిక్‌ 9Rajamouli Biopic) లాంటి డాక్యుమెంటరీ ఒకటి ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుంది. ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ (Modern Masters) పేరుతో ఓ డాక్యుమెంటరీని తీశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) ఆగస్టు 2 నుంచి ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్  కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా సంస్థ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించింది.

Ssr.jpeg
ఇందులో భారతీయ, అంతర్జాతీయ సినిమాపై రాజమౌళి ప్రభావం ఎలా ఉందనేది చూపించబోతున్నాడు. అలానే జక్కన్న గురించి హాలీవుడ్‌ దిగ్గజ డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరూన్‌, జో రూసో, ప్రభాస్‌, రానా, జూ.ఎన్టీఆర్‌ తమ పాయింట్‌ ఆఫ్‌ వ్యూని చెబుతారు. అయితే ఇది బయోపిక్‌లా ఉంటుందా? కేవలం రాజమౌళి గురించి ఎలివేషన్స్‌ ఉంటాయా? అనేది చూడాలి.

ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో(MaheshBabu) 'ఎస్‌ఎస్‌ఎంబీ29' చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్  పనులు, ఫొటో షూట్స్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పూర్తిస్థాయి కథ కూడా లాక్‌ అయింది. ఆగస్ట్‌లో ఈ చిత్రం సెట్స్‌ మీదకెళ్లనుందని టాక్‌. 

Updated Date - Jul 06 , 2024 | 11:17 AM