‘సంధ్యారాగం’ దర్శకుడికి బెస్ట్ డైరెక్టర్ అవార్డ్

ABN , Publish Date - Nov 13 , 2024 | 09:44 AM

వృద్ధ తల్లిదండ్రుల పట్ల బిడ్డలు ప్రవర్తిస్తున్న తీరును హృదయానికి హత్తుకునే విధంగా చిత్రీకరించిన ‘సంధ్యారాగం’ చిత్రానికి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2024 అవార్డుల్లో బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకున్న శ్రీనివాస్ నేదునూరిని ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. అదేంటంటే..

Srinivas Nedunuri

వృద్ద తల్లిదండ్రుల పట్ల బిడ్డలు ప్రవర్తిస్తున్న తీరును హృదయానికి హత్తుకునే విధంగా చిత్రీకరించిన ‘సంధ్యారాగం’ చిత్రానికి ఇప్పటికే పలు అవార్డులు వరించాయి. ఇప్పుడు ఆ చిత్ర దర్శకుడిని మరో ప్రతిష్టాత్మక అవార్డ్ వరించింది. విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విశ్వకర్మ లీడర్ అవార్డుకు బెస్ట్ డైరెక్టర్ కేటగిరిలో ‘సంధ్యారాగం’ చిత్ర దర్శకుడు శ్రీనివాస్ నేదునూరి (Srinivas Nedunuri) ఎంపికయ్యారు. శ్రీనివాస్ నేదునూరి విషయానికి వస్తే..

Also Read- Prabhas: పెళ్లిపై ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు


సాహిత్యం, సినిమా రంగాలపై ఆసక్తితో టాలీవుడ్‌లో దర్శకత్వ విభాగంలో సహాయకుడిగా చేరి, ఆ తరువాత రామోజీ ఫిలిం సిటీలో పలు చిత్రాలకు దాదాపు 15 ఏళ్ళు సహాయకుడిగా పని చేసి పలు టీవీ ఛానళ్లలో, మీడియా హౌస్‌లలో సైతం సామాజిక స్పృహ ఉన్న ప్రోగ్రాములు రూపొందించడమే కాకుండా ‘సంధ్యారాగం’ అనే చిత్రానికి రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా బాధ్యతలు నిర్వర్తించి విమర్శకుల ప్రసంశలు అందుకున్నారు. వృద్ధ తల్లిదండ్రుల పట్ల బిడ్డలు ప్రవర్తిస్తున్న తీరును హృదయానికి హత్తుకునే విధంగా చిత్రీకరించిన ‘సంధ్యారాగం’ చిత్రానికి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2024 అవార్డుల్లో బెస్ట్ డైరెక్టర్ అవార్డు, ‘సంధ్యారాగం’ వంటి సామాజిక స్పృహ కలిగిన చిత్రాన్ని రూపొందించినందుకు విశ్వగురు వరల్డ్ రికార్డ్ సంస్థ శ్రీనివాస్ నేదునూరిని ఉగాది పురస్కారం 2024తో సత్కరించడం జరిగింది. ఓ వైపు పలు పత్రికలలో కథలు, ఆర్టికల్స్ రాస్తూ, మరో వైపు డిజిటల్ రంగంలో ‘ప్రకృతి, అమ్మాయే కావాలి’ లాంటి సందేశాత్మక లఘుచిత్రాలు రూపొందించి ప్రశంసలు అందుకున్నారు. అడ్వర్టైజ్ రంగంలో సైతం తన సత్తా చాటుకుంటున్నారు.


Vishwakharma.jpg

విజయనగరం జిల్లా ఉత్తరావల్లి గ్రామంలో ఓ సాధారణ విశ్వబ్రాహ్మణ కుటుంబంలో నేదునూరి రామారావు, చిన్నమ్మల దంపతులకు జన్మించిన శ్రీనివాస్ నేదునూరి ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా కృషి, పట్టుదల, క్రమశిక్షణతో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విశ్వకర్మ లీడర్ అవార్డు (Vishwakarma Leader Awards)లో బెస్ట్ డైరెక్టర్ కేటగిరిలో ఎంపికయ్యారు. నవంబర్ 13న న్యూ ఢిల్లీలోని అంబేద్కర్ భవన్‌లో జరిగే వేడుకలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు.

Also Read-Kishan Reddy: తనకు ప్రాణహాని ఉందని తెలిసి కూడా..

Also Read-Tollywood Stars: అందరు స్టార్స్ మాల్దీవుల్లోనే.. ఎం జరుగుతుందంటే

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 13 , 2024 | 09:45 AM