Kodi Burra: శ్రీరామ్ హీరోగా.. క్రైమ్ థ్రిల్లర్ ‘కోడి బుర్ర’ ప్రారంభం

ABN , Publish Date - Jul 01 , 2024 | 04:10 PM

ఒకరికి ఒకరు, రోజాపూలు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో శ్రీరామ్ కొత్తగా న‌టిస్తోన్న చిత్రం ‘కోడి బుర్ర’. ఫిలింనగర్ దైవసన్నిధానంలో లాంఛనంగా ప్రారంభమైంది

Kodi Burra: శ్రీరామ్ హీరోగా.. క్రైమ్ థ్రిల్లర్ ‘కోడి బుర్ర’ ప్రారంభం

ఒకరికి ఒకరు, రోజాపూలు, స్నేహితులు, రాగల 24 గంటల్లో వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో శ్రీరామ్ కొత్తగా న‌టిస్తోన్న చిత్రం ‘కోడి బుర్ర’. ఈ రోజు (సోమవారం) హైదరాబాద్ ఫిలింనగర్ దైవసన్నిధానంలో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని వీ4 క్రియేషన్స్ బ్యానర్ (V4 Creations banner)లో కంచర్ల సత్యనారాయణరెడ్డి (Kancharla Satyanarayana Reddy), గట్టు విజయ్ గౌడ్ (Gattu Vijay Goud), చిన్ని చందు (Chinni Chandu), వట్టం రాఘవేంద్ర (Vattam Raghavendra), సముద్రాల మహేశ్ గౌడ్ (Samudrala Mahesh Goud) నిర్మిస్తుండ‌గా చంద్రశేఖర్ కానూరి (Chandrasekhar Kanuri) దర్శకత్వం వహిస్తున్నారు.

94ecde82-80da-41cb-81a0-5650d94f9966.jpeg

శృతి మీనన్ (Shruti Menon), ఆరుషి (Aarushi) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మహావీర్ కీ రోల్ పోషిస్తున్నాడు. ఈ కార్యక్రమంలో అతిథిలుగా పాల్గొన్న ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేయ‌గా.. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ క్లాప్ నిచ్చారు, దర్శకుడు భరత్ కమ్మ స్క్రిప్ట్ అందజేశారు.

cb6700fc-b4e1-4d34-8a43-672ada3dcf0d.jpeg

అనంతరం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. కోడి బుర్ర చిత్రాన్ని మా మిత్రులు నిర్మిస్తున్నారు. మంచి కథను ఈ సినిమా కోసం ఎంచుకున్నారు. ప్రేక్షకుల్ని ఈ మూవీ ఆకట్టుకుని ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాం. హీరో శ్రీరామ్, హీరోయిన్ శృతి మీనన్, నిర్మాతలైన నా మిత్రులు, ఇతర టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు. దర్శకుడు చంద్రశేఖర్ కానూరి మాట్లాడుతూ.. మా కోడి బుర్ర సినిమాలో శ్రీరామ్ గారిని కొత్తగా చూస్తారు. ఆయన ఇప్పటిదాకా లవ్, రొమాంటిక్ తరహా చిత్రాలు చేశారు. కోడి బుర్ర సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారు. హీరోయిన్ శృతి మీనన్ డాక్టర్ రోల్ చేస్తోంది. కోడి బుర్ర అందరికీ నచ్చేమంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా అవుతుందని నమ్ముతున్నామ‌న్నారు. నటుడు మహావీర్ మాట్లాడుతూ.. నేను మా డైరెక్టర్ చంద్రశేఖర్ గత మూవీ రవికుల రఘురామలో విలన్‌గా నటించా ఇప్పుడీ చిత్రంలో కూడా నెగిటివ్ రోల్ చేస్తున్నాను. మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నా అన్నారు.


f06b6e49-bf36-46bd-915b-75df9c0a7cbb.jpeg

హీరో శ్రీరామ్ మాట్లాడుతూ.. క్రైమ్ థ్రిల్లర్ జాన‌ర్‌లో కోడి బుర్ర సినిమా మీ ముందుకు రాబోతోంది. ఈ సినిమా టైటిల్ వినగానే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుందని అన్నారు. వీ 4 క్రియేషన్స్ లో ఈ సినిమా చేయడం సంతోషంగా ఉందని.. డైరెక్టర్ చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని అందరికీ నచ్చేలా ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నారు. శృతి మీనన్ తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేసింది. ఆరుషి మంచి రోల్ చేస్తోంది. హీరోయిన్ శృతి మీనన్ మాట్లాడుతూ.. నేను తమిళ, మలయాళంలో సినిమాలు చేశాను. కోడి బుర్ర చిత్రంతో తెలుగులోకి అడుగుపెడుతున్నాను. తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రంతో పరిచయం కావడం సంతోషంగా ఉందన్నారు. ఆరుషి మాట్లాడుతూ.. ఈ చిత్రం మా టీమ్ అందరికీ మంచి పేరు తెస్తుంది. మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నా అన్నారు.

734b1d62-0fba-4b35-ba7b-80cfa96f3357.jpeg

నిర్మాత గట్టు విజయ్ మాట్లాడుతూ.. ఈ నెల 22వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తున్నాం. ఈ కథ విన్న వెంటనే హీరో శ్రీరామ్ సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేశారు. మంచి మూవీతో మీ అందరి ముందుకు త్వరలోనే వస్తామ‌న్నారు. నిర్మాత కంచర్ల సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ - నా ఫేవరేట్ హీరో శ్రీరామ్ గారితో సినిమా ప్రొడ్యూస్ చేస్తుండటం సంతోషంగా ఉంది. ఆయన ఒకరికి ఒకరు, పోలీస్ పోలీస్ సినిమాలను చాలా సార్లు చూశాను. ఈ చిత్రాన్ని నా మిత్రులు గట్టు విజయ్ గౌడ్, చిన్ని చందు, వట్టం రాఘవేంద్ర, సముద్రాల మహేశ్ గౌడ్ తో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నాను. పేరున్న నటీనటులు మా చిత్రంలో నటించబోతున్నారు. మంచి కథ, మా డైరెక్టర్ గారు ఎంతో క్రియేటివ్ గా సినిమా స్క్రిప్ట్ చేశారు. కోడి బుర్ర సినిమా సక్సెస్ అయ్యి మా బ్యానర్ కు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నామ‌న్నారు.

Updated Date - Jul 01 , 2024 | 06:21 PM