Chiranjeevi - Srikanth Odela: అభిమాన హీరోతో సినిమా..

ABN , Publish Date - Dec 02 , 2024 | 09:01 AM

సీనియర్‌ హీరో, యువ దర్శకుల కాంబినేషన్‌ ఇప్పుడు సూపర్‌హిట్‌ ఫార్ములా. ఇలా వచ్చిన చిత్రాలు అన్ని భాషల్లోను ప్రభావం చూపుతున్నాయి. చిన్నప్పటి నుంచి తమ సినిమాల్ని చూస్తూ పెరిగిన యువతరం దర్శకులు చెబుతున్న కథలు అగ్ర తారలకి బాగా నచ్చేస్తున్నాయి.


సీనియర్‌ హీరో, యువ దర్శకుల కాంబినేషన్‌ ఇప్పుడు సూపర్‌హిట్‌ ఫార్ములా. ఇలా వచ్చిన చిత్రాలు అన్ని భాషల్లోను ప్రభావం చూపుతున్నాయి. చిన్నప్పటి నుంచి తమ సినిమాల్ని చూస్తూ పెరిగిన యువతరం దర్శకులు చెబుతున్న కథలు అగ్ర తారలకి బాగా నచ్చేస్తున్నాయి. దాంతో వాళ్ల అనుభవంతో సంబంధం లేకుండా కొత్తవారికి అవకాశం ఇస్తున్నారు. తమ అభిమాన హీరోను తెరపై ఎలా చూపించాలనుకుంటున్నారో అలా చూపించి మంచి రిజల్ట్‌ రాబడుతున్నారు. తాజాగా తెలుగులో అలాంటి ఓ కాంబినేషన్‌ సెట్‌ అయింది.

అగ్ర హీరో చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా... ‘దసరా’ ఫేం శ్రీకాంత్‌ ఓదెల (Srikanth odela) దర్శకత్వంలో ఓ చిత్రానికి రంగం సిద్థమైంది. ‘దసరా’ విడుదల తర్వాతే శ్రీకాంత్‌ తన అభిమాన కథానాయకుడైన చిరంజీవికి కథ వినిపించారు. రెండో సినిమాగానే చిరంజీవితో చేయాలనుకున్నారు. కానీ అప్పుడు కుదరలేదు. ప్రస్తుతం శ్రీకాంత్‌ ఓదెల మరోసారి నానితో కలిసి ‘ది ప్యారడైజ్‌’ (The Paradise) అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. దీని తర్వాత చిరంజీవి - శ్రీకాంత్‌ ఓదెల కలిసి సినిమా చేయనున్నారు. సుధాకర్‌ చెరుకూరి (Sudhakar cherukuri) నిర్మించనున్నారు. వచ్చే ఏడాదే ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. చిరంజీవి ప్రస్తుతం మరో యువ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’’ సినిమా చేస్తున్నారు. ఇందులో త్రిష కథానాయిక. యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది

Updated Date - Dec 02 , 2024 | 09:02 AM