Sreeleela: 'కిస్సిక్' కోసం శ్రీలీల ఎంత ఛార్జ్ చేసిందో తెలుసా..

ABN , Publish Date - Nov 27 , 2024 | 07:23 AM

'కిస్సిక్' సాంగ్ కోసం శ్రీలీల ఎన్ని కోట్లు ఛార్జ్ చేసిందో తెలుసా? అసలు బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్‌ని ఎందుకు వద్దనుకున్నారంటే..

ప్రపంచమంతా ఎదురు చూస్తున్న ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమా డిసెంబర్ 5న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. పుష్పరాజ్ గాడి వైల్డ్ ఫైర్ ఎలా ఉంటుందో చూసేందుకు అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఆ విషయం అడ్వాన్స్ బుకింగ్స్ తెలియజేస్తున్నాయి కూడా. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్‌ దర్శకత్వంలో సుకుమార్‌ రైటింగ్స్‌ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్ర ప్రమోషన్స్ ప్రస్తుతం యమా జోరుగా జరుగుతున్నాయి.


పుష్ప మూవీలో 'ఊ అంటావా మావ. ఊఊ అంటావా’ పాట ఎంతగా పాపులర్‌ అయిందో తెలిసిందే. దానిని మించేలా 'పుష్ప -2'లో ఐటెమ్‌సాంగ్‌ను ప్లాన్‌ చేస్తారని అభిమానులు ఎంతో వెయిట్ చేశారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఆదివారం ‘కిస్సిక్‌’ అంటూ అల్లు అర్జున్‌, శ్రీలీలపై తెరకెక్కించిన సాంగ్‌ను చెన్నైలో జరిగిన ఈవెంట్‌ లో విడుదల చేశారు. అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేమికులు ఎంతో ఎదురు చూసిన ‘కిస్సిక్‌’ సాంగ్ కాస్త డిసప్పాయింట్ చేసింది. 'ఊ అంటావా మావ.. ఊఊ అంటావా’ స్థాయి అంచనాలను ఏ మాత్రం రీచ్ కాలేకపోయింది. దీంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ స్టార్ట్ అయ్యాయి. స్వాగ్ కింగ్ తో పాటు డ్యాన్సింగ్ క్వీన్ కాంబోలో ఈ సాంగ్ అదిరిపోతుందని అంత భావించారు. కానీ.. ఈ సాంగ్ ట్యూన్, లిరిక్స్ అభిమానులకి నచ్చడం లేదు.


ఇక ఈ సాంగ్ కోసం మొదట బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ ని సంప్రదించారు. అయితే ఆమె రూ. 6 కోట్లు డిమాండ్ చేయడంతో మేకర్స్ లైట్ తీసుకున్నారు. టాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీలని రూ. 2 కోట్లకు ఒప్పించేశారు. ఒకప్పుడు వరుస సినిమాలతో ఊపేసిన శ్రీలీల కెరీర్ ఇప్పుడు కాస్త డల్ అయ్యింది. ఈ సాంగ్ కోసం ఛార్జ్ చేసినా రెండు కోట్లు ఆమె ఒక సినిమా మొత్తం చేయడానికి తీసుకునే రెమ్యునరేషన్ తో సమానం. దీంతో ఈ సాంగ్ ఆమె కెరీర్ లో ఎంతో కీలకం అని చెప్పాలి.

Updated Date - Nov 27 , 2024 | 07:23 AM