Sreeleela: శ్రీలీలలో ఈ యాంగిల్ చూశారా? కళ్లు చెదిరిపోయాయి!
ABN , Publish Date - Mar 03 , 2024 | 10:59 AM
శ్రీలీల పక్కన డాన్స్ చేయాలంటే సవాల్‌తో కూడిన పనే. ఇది మహేష్‌బాబు చెప్పిన మాట. అయితే సినిమాల్లో నాటు, మాస్ డాన్స్ మాత్రమే కాదు. మతి పొగొట్టే క్లాసికల్ డాన్సర్ కూడా శ్రీలీలలో ఉంది. ఆమెకు చిన్నతనం నుంచే క్లాసికల్‌లో టచ్ ఉంది. తాజాగా ఆ ప్రతిభను ఓ వేదికపై ప్రదర్శించింది.
శ్రీలీల.. (Sreeleela)ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. చిన్న సినిమాతో కెరీర్ ప్రారంభించి వరుసగా అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకొని అతి తక్కువ సమయంలో స్టార్‌డమ్ తెచ్చుకుంది.
నటన, డాన్స్ తను ఎసెట్ అని అభిమానులు ప్రశంసిస్తుంటారు. శ్రీలీల పక్కన డాన్స్ చేయాలంటే సవాల్‌తో కూడిన పనే. ఇది మహేష్‌బాబు చెప్పిన మాట. అయితే సినిమాల్లో నాటు, మాస్ డాన్స్ మాత్రమే కాదు. మతి పొగొట్టే క్లాసికల్ డాన్సర్ కూడా శ్రీలీలలో ఉంది.
ఆమెకు చిన్నతనం నుంచే క్లాసికల్‌లో టచ్ ఉంది. తాజాగా ఆ ప్రతిభను ఓ వేదికపై ప్రదర్శించింది. ఇటీవల జరిగిన సమత కుంభ్-2024 (Samatha Kumbh 2024) వేడుకల్లో శ్రీలీల ఇచ్చిన ప్రదర్శన ఆహూతులను అలరించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘ఇప్పటివరకూ శ్రీలీలలో ఇంత ప్రతిభ ఉందనుకోలేదు’, ‘కళ్లు చెదిరిపోయాయి వర్మ..’ అంటూ ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు, శ్రీలీల అభిమానులు. గోదాదేవిగా ఆమె అభినయానికి వీక్షకులు ఫిదా అయిపోయారు. అమెరికాలో పుట్టిన శ్రీలీల చిన్నప్పటి నుంచే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్న ఈ విషయాన్ని ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చింది.
తాజా ప్రదర్శన గురించి శ్రీలీల ఇన్స్టా గ్రామ్ వేదికగా పోస్ట్ పెట్టింది ‘‘మీకు తెలుసో లేదో చిన్నప్పుడే క్లాసికల్ డ్యాన్స్‌తో నా ప్రయాణం మొదలైంది. మా బృందంతో కలిసి ప్రదర్శనలు ఇవ్వడానికి నేను వెళ్తుండేదాన్ని. ఎక్కువగా ఆలయాల్లోనే ప్రదర్శన ఇచ్చేవాళ్లం. మా బృందాన్ని ‘బాల్లెట్స్’ అని పిలిచేవారు. అప్పటి రోజులు నాకు ఎన్నో విషయాలు నేర్పాయి. ఆ సమయంలో ప్రతి క్షణాన్నీ ఆస్వాదించా. అప్పట్లో అదొక హాబీగా అయిపోయింది.
ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇలాంటి ప్రదర్శన చేయడం కొత్తగా అనిపించినా, ఇప్పటికీ డ్యాన్స్ నాలో ఒక భాగమే అనిపిస్తోంది. నాలో మీరు చూస్తున్న మరొక కోణం ఇది. ‘అభినయ’, భావ’ ఇలా అన్నీ డ్యాన్సే నాకు నేర్పింది. ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే, దాదాపు 10-15ఏళ్ల తర్వాత నేను స్టేజ్ ప్రదర్శన ఇవ్వడం ఇదే తొలిసారి. ప్రాక్టీస్ చేయడానికి నా వంతు నేను ప్రయత్నించా.
గోదాదేవి అంటే మహిళల్లో రత్నంలాంటిది. ఆమె గాథ ఎంతో అందంగా ఉంటుంది. ఈ ప్రదర్శన ఇవ్వడానికి ప్రోత్సహించిన మంజు భార్గవి గారికి కృతజ్ఞతలు. నాకు ఈ ప్రదర్శన ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. స్క్రిప్ట్ చదవడం అంటే నాకు ఎంతో ఇష్టం. మీకు ఏదైనా ఆసక్తిగా అనిపిస్తే నాకు తెలియజేయండి. నాకు అనిపించింది మీతో పంచుకుంటా.
ఇప్పటికే చాలా చెప్పేశాను. చిన్నతనంలో ప్రదర్శనలిస్తున్న సమయంలో నా ప్రేక్షకులు కేవలం నా కుటుంబమే. ఇప్పుడు అభిమానుల రూపంలో నాకు ఎంతో పెద్ద కుటుంబం ఉంది’’ - ప్రేమతో లీల అని పేర్కొంది