Tollywood: ఈ సినిమాల్లో ఆ ఎపిసోడ్స్ చూస్తే.. పూనకాలే
ABN , Publish Date - Nov 20 , 2024 | 12:37 PM
పుష్ప 2, గేమ్ ఛేంజర్, డాకు మహరాజ్ సినిమాల్లో స్పెషల్ ఎపిసోడ్స్ ఆడియెన్స్‌కి గూస్ బంప్స్ తెప్పించనున్నాయి. ఈ సినిమాల కోసం డైరెక్టర్లు ప్రత్యేకంగా తీర్చిదిద్దిన స్పెషల్ ఎపిసోడ్స్ ఏంటంటే..
ప్రస్తుతం చలికాలంతో పాటు టాలీవుడ్ సినిమా ఫీవర్ కూడా స్టార్ట్ అయ్యింది. పుష్ప 2, గేమ్ ఛేంజర్, డాకు మహరాజ్ సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉండటంతో ఫ్యాన్స్ ఫుల్ హుషారు మీదున్నారు. ఆ ఉషూరుకి మరింత జోరు పెంచేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ మూడు సినిమాల్లో మూడు హైలెట్ గా నిలిచే స్పెషల్ ఎపిసోడ్స్ ని ప్లాన్ చేశారు. ఆ ఎపిసోడ్స్ చూస్తే థియేటర్ లలో పూనకాలు ఖాయం అంటున్నారు. ఇంతకీ ఆ స్పెషల్ ఎపిసోడ్స్ ఏంటంటే..
'పుష్ప 2’లో అత్యంత కీలకమైంది ‘జాతర ఎపిసోడ్’. అదొక మాస్టర్ పీస్‌గా నిలుస్తోంది అంటున్నారు నిర్మాతలు. జాతర ఎపిసోడ్‌కు భారీగా ఖర్చు చేసినట్లు, ఆ తరహా సన్నివేశం ఏ సినిమాలోనూ రాలేదని నిర్మాతల్లో ఒకరైన యలమంచిలి రవిశంకర్ అన్నారు. అల్లు అర్జున్ గెటప్ నుంచి, సెట్స్, వేల సంఖ్యలో ఆర్టిస్ట్‌లు, 15 రోజులు రిహార్సెల్స్, 35 రోజులు చిత్రీకరణ వెరసి ఇదొక అద్భుతం కాబోతుందని మొదటి నుంచి టాక్ ఉంది. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందని నిర్మాతలు అంటున్నారు. జాతర సీక్వెన్స్‌కు రూ. 50 కోట్లు ఖర్చు చేశారనే విషయాన్ని ప్రశ్నించగా సినిమాకు ఉన్న స్పాన్ అందులో ఆ పర్టిక్యులర్ సీక్వెన్స్‌కు ఉన్న ఇంపార్టెంట్ దృష్ట్యా భారీగా ఖర్చు చేశామని చెప్పారు. మరో నిర్మాత మాట్లాడుతూ.. ’’జాతర ఎపిసోడ్ థియేటర్లో రోమాలు నిక్కబోడిచేలా ఉంటుంది. దాదాపు 35 రోజులు చిత్రీకరణ చేశాం. పది పదిహేను రోజులు రిహార్సల్స్ కూడా జరిపాం. ఈ ఎపిసోడ్ కోసం బన్నీ చాలా కష్టపడ్డారు. రోజంతా మొహానికి రంగులేసుకుని, చీర కట్టుకొని సెట్లో కూర్చునేవారు. ఆయన పడిన కష్టానికైనా ‘పుష్ప 2’ పెద్ద హిట్ కావాలి. ఈ సీన్ కోసం మైండ్ లెస్‌గా లెక్కలు లేకుండా ఏం వృధాగా ఖర్చు పెట్టలేదు’’ అని అన్నారు.
ఇక సంక్రాంతికి రిలీజ్ కానున్న 'గేమ్ ఛేంజర్'లో హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తోన్న 'హైడ్రా' లాంటి ఒక ఎపిసోడ్‌ని తీర్చిదిద్దారు. నిజాయితీగల IAS అధికారి పాత్రల్లో రామ్ చరణ్ కనబడుతుండటంతో అక్రమ కూల్చివేతల సన్నివేశాన్ని ఒకటి ప్లాన్ చేశారట. ఈ ఎపిసోడ్ సినిమాలోనే మేజర్ హైలెట్‌గా నిలవనున్నట్లు తెలుస్తుంది. గేమ్ ఛేంజర్‌లో ఎస్‌జె సూర్య ప్రధాన విలన్‌గా నటిస్తుండగా శ్రీకాంత్, సునీల్, అంజలి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు
హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 109వ చిత్రం ‘డాకు మహారాజ్’. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది.'ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మ రాజుది. మరణాన్ని వణికించిన మహారాజుది’ అంటూ బాలయ్యని పరిచయం చేసిన తీరు గూస్ బంప్స్ తెప్పించింది. ఈ సినిమాలో కూడా ఫ్లాష్ బ్యాక్ సీన్ తో వింటేజ్ బాలయ్యని చూపించనున్నారంట. ఈ సీన్ సినిమాకే హైలెట్‌గా నిలవనుంది.