SP Charan: భావోద్వేగాలను రీక్రియేట్‌ చేయలేరు

ABN , Publish Date - Nov 28 , 2024 | 03:45 PM

‘ఏఐతో వాయిన్‌ను రీక్రియేట్‌ చేయడానికి నేను వ్యతిరేకిని. ఇటీవల వచ్చిన ‘మనసిలాయో..’ (వేట్టయాన్‌)పాట చాలా హిట్‌ అయింది.

గాన గంధర్వుడు ఎస్‌పి. బాల సుబ్రహ్యణ్యం (SPB) వాయిస్‌ను ఏఐతో రీక్రియేట్‌ (AI technology) చేయడానికి అంగీకరించకపోవడానికి కారణాన్ని వివరించారు ఆయన తనయుడు ఎస్‌.పి చరణ్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎస్పీ చరణ్‌ (SP Charan) మాట్లాడుతూ "ఏఐ ఉపయోగించి వాయిస్‌ను రీక్రియేట్‌ చేస్తే సహజత్వం ఉండదని అభిప్రాయపడ్డారు. ‘వేట్టయాన్‌’లో దివంగత గాయకుడు మలేషియన్‌ వాసుదేవన్‌ గాత్రాన్ని ఏఐతో రీక్రియేట్‌ చేసిన మనసిలాయో పాట గురించి ప్రస్తావించారు. ‘ఏఐతో వాయిన్‌ను రీక్రియేట్‌ చేయడానికి నేను వ్యతిరేకిని. ఇటీవల వచ్చిన ‘మనసిలాయో..’ (వేట్టయాన్‌)పాట చాలా హిట్‌ అయింది. ఒకవేళ ఎస్పీబీ జీవించి ఉంటే ఆ పాట కోసం ఆయన్ని సంప్రదించి ఉండేవారేమో. మనందరికీ ఎస్పీబీ, మలేషియన్‌ వాసుదేవన్‌ల మీద ఉన్న ప్రేమ కారణంగా వాళ్ల వాయిస్‌లను రీక్రియేట్‌ చేయాలనిపిస్తుంది.

Spb.jpgవారు ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. ఏఐని ఉపయోగించి మీరు స్వరాన్ని రీక్రియేట్‌ చేయగలరు కానీ.. పాటలు వినడం వల్ల కలిగే భావోద్వేగాలను రీక్రియేట్‌ చేయలేరు’ అని అన్నారు.  ఇప్పటికే నాన్నగారి వాయిస్‌రె రీ క్రియేట్‌ చేస్తామని ఎంతోమంది అడిగారు.. దానికి నేను అంగీకరించలేదు. వద్దని గట్టిగా చెప్పాను. అలా చేస్తే ఆ స్వరంలో సహజత్వం ఉండదు. అలాంటి గొంతు వినడం నాకు, నా కుటుంబానికి ఇష్టంలేదు. అందుకే ఓ బాధ్యత కలిగిన సంగీత దర్శకుడిని అయినప్పటికీ దీనికి వ్యతిరేకించాను. పాడిన పాటల రూపంలో ఆయన ఎప్పటికీ జీవించే ఉంటారు’ అని చరణ్‌ అన్నారు. 

Updated Date - Nov 28 , 2024 | 03:45 PM