Son of Tsunami: గ్రాండ్‌గా ‘సన్నాఫ్ సునామీ’ మూవీ ప్రారంభం
ABN , Publish Date - Jun 11 , 2024 | 09:59 PM
దిలీప్ కుమార్ రాథోడ్, అరవిందా అగర్వాల్, షణ్ణు హీరోహీరోయిన్లుగా చిత్తజల్లు ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘సన్నాఫ్ సునామీ’ చిత్రం తాజాగా హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ‘శతృవుల గుండెల్లో దడ’ అనేది ఈ చిత్రానికి ట్యాగ్ లైన్. ఈ సినిమాతో పాటు ‘బాలతేజం’ అనే సినిమా కూడా ప్రారంభమవడం విశేషం. ఈ రెండు చిత్రాలను కృష్ణ ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
దిలీప్ కుమార్ రాథోడ్, అరవిందా అగర్వాల్, షణ్ణు హీరోహీరోయిన్లుగా చిత్తజల్లు ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘సన్నాఫ్ సునామీ’ (Son of Tsunami) చిత్రం తాజాగా హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ‘శతృవుల గుండెల్లో దడ’ అనేది ఈ చిత్రానికి ట్యాగ్ లైన్. ఈ సినిమాతో పాటు ‘బాలతేజం’ అనే సినిమా కూడా ప్రారంభమవడం విశేషం. ఈ రెండు చిత్రాలను కృష్ణ ప్రసాద్ (Krishna Prasad) ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. నటీనటులపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ క్లాప్ కొట్టారు. ఆసక్తికరమైన కథ, కథనాలతో తెలుగు తెరపైకి ఒక యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ‘సన్నాఫ్ సునామీ’ రాబోతుందని మేకర్స్ ఈ సందర్భంగా తెలియజేశారు. (Son of Tsunami Movie Launched)
Also Read- Ap Cm Oath Ceremony: బాబు ప్రమాణ స్వీకారం.. మెగాస్టార్‌కు ప్రత్యేక ఆహ్వానం!
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ (Ramakrishna Goud) మాట్లాడుతూ.. ‘సన్నాఫ్ సునామీ’ నటీనటులు బాగా నటించే వారే. ఈ సినిమా కాన్సెఫ్ట్ చాలా బాగుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సినిమా యూనిట్‌కు మంచి పేరు వస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా దర్శక నిర్మాతలకు మా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ద్వారా పూర్తి సహాకారం అందిస్తాము. సినిమా రిలీజ్‌కు పూర్తి సహాకారం అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామని అన్నారు.
నిర్మాత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. మా బ్యానర్‌లో ‘సన్నాఫ్ సునామి, బాల తేజం’ చిత్రాలను ప్రారంభించడం సంతోషంగా ఉంది. మరో రెండు సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. మంచి కాన్సెప్ట్‌తో సినిమాలు చేయాలన్నదే మా బ్యానర్ ఉద్దేశం. అన్ని వర్గాలకు నచ్చే విధంగా సినిమాలు తెరకెక్కిస్తున్నాము. మా సినిమాలో నటించే నటీనటులు, పని చేసే టెక్నిషియన్స్ సహాకారంతో రెండు సినిమాలు కంప్లీట్ చేశాము. మరో రెండు సినిమాలు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో దిలీప్ కుమార్ రాథోడ్, హీరోయిన్లు అరవింద అగర్వాల్, షణ్ణు.. పాటల రచయిత గడ్డ సీతారామ చౌదరి, సంగీత దర్శకుడు లక్ష్మణ్ సాయి వంటి వారు ప్రసంగించారు.
Read Latest Cinema News