Sobhita Dhulipala: శోభిత ఐటం సాంగ్.. గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చిందా..

ABN , Publish Date - Aug 27 , 2024 | 12:39 PM

మ‌రో కొద్ది రోజుల్లో బాలీవుడ్ బ్యూటీ, తెలుగు సోయ‌గం శోభిత దూళిపాళ్ల అక్కినేని వారి ఇంట అడుగుపెట్ట‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా శోభిత‌కు బ‌డా బాలీవుడ్ ప్రోడ‌క్ష‌న్ హౌజ్ నుంచి ఓ బంఫ‌రాఫ‌ర్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

Sobhita Dhulipala

మ‌రో కొద్ది రోజుల్లో బాలీవుడ్ బ్యూటీ, తెలుగు సోయ‌గం శోభిత దూళిపాళ్ల (Sobhita Dhulipala) అక్కినేని వారి ఇంట అడుగుపెట్ట‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఎంగేజ్‌మెంట్ పూర్తి చేసుకున్న నాగ చైత‌న్య (Naga Chaitanya), శోభిత జంట మ‌రో రెండు మూడు నెల‌ల్లో డెస్టినేష‌న్ వెడ్డింగ్‌తో పెళ్లి పీట‌లు ఎక్క‌నున్నారు. ఈ విష‌యంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం త‌మ సినిమా షూటింగ్‌ల‌ను కానిచ్చేస్తున్నారు. నాగ చైత‌న్య తండేల్ సినిమా షూటింగ్ బిజీలో ఉండ‌గా శోభిత సితార అనే ఓ హిందీ చిత్రంలో నటిస్తోంది.

Sobhita-Post.jpg

అయితే తాజాగా శోభిత‌కు (Sobhita Dhulipala) బ‌డా బాలీవుడ్ ప్రోడ‌క్ష‌న్ హౌజ్ నుంచి ఓ బంఫ‌రాఫ‌ర్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. షారుఖ్‌ఖాన్‌, ర‌ణ్ వీర్ సింగ్ వంటి ఆగ్ర హీరోలు న‌టిస్తున్న డాన్‌3 సినిమాలో ఓ ప్ర‌త్యేక పాట కోసం మూవీ మేకర్స్ శోభితను సంప్ర‌దించిన‌ట్లు బాలీవుడ్ కోడై కూస్తోంది ఈ విష‌య‌మై ఇప్పటికే ఆమెతో చ‌ర్చ‌లు కూడా ముగిసిన‌ట్లు తెలుస్తోంది.

sobhitadhulipalanew6.jpg

అయితే శోభిత ఇప్పటి వరకు త‌న సినీ కెరీర్‌లో ఒక్క‌ ఐటెం సాంగ్ కూడా చేయలేదు. ఈమ‌ధ్యే నాగ చైతన్యతో పెళ్లికి సిద్ధమైన శోభిత మ‌రి ఈ ఐటం సాంగ్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందా, ఇస్తుందా అనే విష‌యం తెలియాల్సి ఉంది. మ‌రి కోద్ది రోజుల్లో అధికార ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Sobhita Dhulipala


Sobhita Dhulipala

ఇదిలాఉండ‌గా గ‌తంలో నాగ చైతన్య (Naga Chaitanya), సమంత (Samantha) పెళ్లి తరువాత అక్కినేని ఫ్యామిలీ ఆమె కెరీర్ విషయంలో ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వ‌గా నాగ చైతన్య సమంతను బాగా ప్రోత్సహించాడు. ఆ క్ర‌మంలో సమంత ఒక‌టి రెండు బోల్డ్ రోల్స్ చేసింది. దీంతో అవే వారి మ‌ధ్య‌ విభేదాలకు కారణమ‌నే ప్రచారం కూడా నడిచింది.

Sobhita Dhulipala

ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ వారి విడాకులకు ప్రధాన కారణమన్న వార్తలు కూడా అప్ప‌ట్లో బాగా హ‌ల్‌చ‌ల్ చేశాయి. అదే నిజ‌మ‌న్న‌ట్లుగా చైతన్యతో కలిసి విడాకుల ప్రకటన జరిగిన నెలలోపే పుష్ప సినిమాలో సమంత గాటు ఐటైం సాంగ్ కూడా చేసింది.

samantha

అదంతా ఇప్పుడు గతం అనుకుంటే కొద్దిరోజుల క్రితమే‌ నాగచైతన్య ,శోభిత (Sobhita Dhulipala) ల ఎంగేజ్మెంట్ జర‌గ‌గా రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ కు ప్లానింగ్ జరుగుతున్నట్లుగా సమాచారం. మ‌రి ఈ పెళ్ల‌య్యాక అక్కినేని ఫ్యామిలీ స‌మంత‌కు ఇచ్చిన‌ట్టుగానే శోభిత సినిమాల్లో న‌టించ‌డానికి ఒప్పుకుంటారా అనేది వంద డాల‌ర్ల ప్ర‌శ్న‌లా ఉంది.

Sobhita Dhulipala

ఎదయితే సమంత చైతన్య విడాకుల విషయంలో ప్రముఖంగా వినిపించిన బోల్డ్ రోల్స్‌ను శోభితా తన కెరీర్ ముందు నుంచి పోషిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. మ‌రి ఇప్పుడు దర్శకుడు ఫరాన్ అక్తర్ డాన్ 3 సినిమాలో ఐటం సాంగ్ ఆఫ‌ర్ ఇచ్చారని తెలుస్తోంది. మరీ ఈ ఛాన్స్ ను శోభితా ఉపయోగించుకుంటుందా.. శోభితకు ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లభిస్తుందా అనే ఆసక్తికరమైన చర్చ సోషల్ మీడియాలో తెగ‌ నడుస్తొంది.

Sobhita Dhulipala

Updated Date - Aug 27 , 2024 | 05:22 PM