SKN: కంటెంట్ మీద నమ్మకం ఉంది.. అందుకే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నాం
ABN , Publish Date - Feb 08 , 2024 | 09:53 PM
మణికందన్, శ్రీగౌరి ప్రియ జంటగా నటిస్తున్న సినిమా ట్రూ లవర్. ఈ సినిమాను డైరెక్టర్ మారుతి, ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 10వ తేదీన సినిమా రిలీజ్ సందర్భంగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
మణికందన్ (Manikandan), శ్రీ గౌరి ప్రియ (Sri Gouri Priya), కన్న రవి లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా ట్రూ లవర్ (True Lover). ఈ సినిమాను మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్ పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. ఓ విభిన్న ప్రేమ కథగా దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. ఈ సినిమాను డైరెక్టర్ మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 10వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకు వస్తున్నారు. ఇవాళ "ట్రూ లవర్" సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ.. ఈ సినిమా తమిళ ప్రీమియర్స్ చూసిన వాళ్లు ఇటీవల కాలంలో ఇలాంటి మంచి లవ్ స్టోరి రాలేదని చెబుతున్నారు. తెలుగు ఆడియెన్స్ కు కూడా ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఇప్పటి దాకా "ట్రూ లవర్" నుంచి రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ వంటి కంటెంట్ మొత్తానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ శనివారం సినిమాను థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం. రేపు రాత్రి 9 గంటలకు సెలబ్రిటీలు, మీడియాకు కూకట్ పల్లి విశ్వనాథ్ థియేటర్ లో షో వేస్తున్నాం. మరికొన్ని థియేటర్స్ లో పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నాం. మా బేబీ సినిమాకు కూడా ఇలాగే ముందు రోజు ప్రీమియర్ వేశాం. కంటెంట్ మీద మాకు నమ్మకం ఉంది. ఈ సినిమా మీద అతి తక్కువ టైమ్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అందుకే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సుదర్శన్ థియేటర్, కూకట్ పల్లిలో విశ్వనాథ్ వంటి మంచి థియేటర్స్ దొరికాయి.
మారుతికి యూత్ సినిమాలంటే ఇష్టం. ఈ సినిమాను బాగా నచ్చి తీసుకున్నారు. మణికందన్ తమిళ హీరో అయినా తెలుగు నేర్చుకుని డబ్బింగ్ చెప్పారు. శ్రీగౌరి ప్రియ తెలుగు అమ్మాయి.. తమిళం నేర్చుకుని డబ్బింగ్ చెప్పింది. వీళ్లు ఇంత కమిటెడ్ గా సినిమా కోసం పనిచేశారు. అలాగే డైరెక్టర్ ప్రభురామ్ వ్యాస్ కు ఈ సినిమా రిలీజ్ అయ్యాక చాలా ఆఫర్స్ వస్తాయి. ప్రేమికురాలి విషయంలో అబ్బాయిలో ఉండే అభద్రతను తన పర్ ఫార్మెన్స్ లో సహజంగా మణికందన్ (Manikandan) చూపించాడు. అలాగే లవర్ ఇన్ సెక్యూరిటీని చూసి బాధపడే అమ్మాయిగా శ్రీ గౌరి ప్రియ (Sri Gouri Priya) నటన ఆకట్టుకుంటుంది.
మా ప్రతి సినిమాకు సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకు థ్యాంక్స్. రేపు ట్రూ లవర్ (True Lover) ప్రీమియర్ ను కలిసి చూసి ఎంజాయ్ చేద్దాం. ఈ సినిమా ఈ వాలెంటైన్ డే విన్నర్ అవుతుంది. రవితేజ ఈగిల్ తో మా సినిమాకు పోటీ లేదు. 200 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం. మాస్ మహారాజ్ రవితేజ అంటే నాకు ఇష్టం. నేను ఆయనకు పీఆర్ ఓగా పనిచేశాను. నేను ఆయనతో ఓ సినిమా కూడా చేయాలని అనుకున్నా. ఈ నెల 9వ తేదీ అనేది సోలోగా ఈగిల్ దే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వివేక్ గారికి, విశ్వప్రసాద్ గారికి చెప్పి వారి అనుమతితోనే 10న "ట్రూ లవర్" రిలీజ్ కు రెడీ అయ్యాం. వాలెంటైన్ డే విన్నర్ అంటే ప్రేక్షకుల మనసుల్ని గెల్చుకుంటుందని చెప్పా. బేబి హిందీ రీమేక్ లో నేను నటిస్తున్నాను అనే రూమర్స్ లో నిజం లేదు. అన్నారు.