Siva Balaji: యూట్యూబర్‌పై కేసు నమోదు!

ABN , Publish Date - Sep 08 , 2024 | 03:21 PM

కొందరు నటీనటులను ఉద్దేశించి నెగెటివ్‌ ట్రోల్స్‌ చేస్తున్న యూట్యూబర్‌ విజయ్‌ చంద్రహాసన్‌పై (Vijay chandrahas) నటుడు, ‘మా’ కోశాధికారి శివ బాలాజీ (Siva balaji) హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌కు (Cyber crime) ఫిర్యాదు చేశారు


కొందరు నటీనటులను ఉద్దేశించి నెగెటివ్‌ ట్రోల్స్‌ చేస్తున్న యూట్యూబర్‌ విజయ్‌ చంద్రహాసన్‌పై (Vijay chandrahas) నటుడు, ‘మా’ కోశాధికారి శివ బాలాజీ (Siva balaji) హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌కు (Cyber crime) ఫిర్యాదు చేశారు. నటీనటులతోపాటు మా అధ్యక్షుడు మంచు విష్ణు(manchu Vishnu), ఆయన నిర్మాణ సంస్థ గురించి విపరీతంగా ట్రోల్స్‌ చేస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘మా’ గౌరవాన్ని దెబ్బతీసేలా అతడు తరచూ వీడియోలు చేస్తున్నాడని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో లింక్స్‌ను పోలీసులకు అందజేశారు. ఈ మేరకు పోలీసులు యూట్యూబర్‌ విజయ్‌ చంద్రహాసన్‌పై కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. సదరు యూట్యూబర్‌కు నోటీసులు పంపించారు.

Updated Date - Sep 08 , 2024 | 03:21 PM