Sitara: శ్రీలీలకు ఏ మాత్రం తగ్గకుండా.. దమ్ మసాలా.. ధూమ్ దాం

ABN , Publish Date - Feb 03 , 2024 | 11:35 AM

టాలీవుడ్‌ స్టార్‌ కిడ్స్‌లో యాక్టివ్‌గా కనిపించే, వినిపించే పేరు సితార ఘట్టమనేని. మహేశ్‌ బాబు గారాలపట్టీగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ తెచ్చుకుంది. ఇన్స్టా వీడియోలు, సేవా కార్యక్రమాలు, యూట్యూబ్‌ ఇంటర్వ్యూలతో పాపులర్‌ అయిన సితార మహేష్‌ అభిమానులకే కాదు, తెలుగు ప్రేక్షకులకూ ప్రత్యేకంగా కనిపిస్తుంది.

Sitara: శ్రీలీలకు ఏ మాత్రం తగ్గకుండా.. దమ్ మసాలా.. ధూమ్ దాం

టాలీవుడ్‌ స్టార్‌ కిడ్స్‌లో యాక్టివ్‌గా కనిపించే, వినిపించే పేరు సితార ఘట్టమనేని (sitara Ghattamaneni). మహేశ్‌ బాబు (Maheshbabu) గారాటపట్టీగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ తెచ్చుకుంది. ఇన్స్టా వీడియోలు, సేవా కార్యక్రమాలు, యూట్యూబ్‌ ఇంటర్వ్యూలతో పాపులర్‌ అయిన సితార మహేష్‌ అభిమానులకే కాదు, తెలుగు ప్రేక్షకులకూ ప్రత్యేకంగా కనిపిస్తుంది. భవిష్యత్తులో తను సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందని నమ్రత ఓ సందర్భంలో వెల్లడించారు. దానికి తగ్గట్టే ఆమె క్లాసికల్‌ డాన్స్  కూడా  నేర్చుకుంటుంది. అప్పుడప్పుడు సూపర్‌ హిట్‌ సాంగ్స్‌కు స్టెప్పులేస్తూ తన సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంటుంది. తాజాగా ‘గుంటూరు కారం’ (guntur kaaram) సినిమాలోని సూపర్‌ హిట్‌ సాంగ్‌కు సితార తనదైన శైలిలో డాన్స్  చేసి మెప్పించింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. 

‘గుంటూరు కారం’ సినిమాలోని ‘దమ్‌ మసాలా’ (Dum masala) పాటకి ఆమె దుమ్ము రేపే డాన్స్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. ఇందులో సితార డాన్స్ కి  ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.   హీరోయిన్‌ శ్రీలీలకు ఏ మాత్రం తగ్గకుండ సితార డ్యాన్స్‌ ఉందని కామెంట్లు చేస్తున్నారు.  సితారా డ్యాన్స్‌ త్రీ డీలో కనిపిస్తుందని ఘట్టమనేని ఫ్యాన్స ఆ వీడియో షేర్‌ చేస్తున్నారు. ఆ వీడియోకు ఇప్పటి వరకు 50 లక్షల వ్యూస్‌ రావడం విశేషం. సితారకు ఇన్ స్టాలో రెండు మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. 


Updated Date - Feb 03 , 2024 | 11:42 AM