OG: ఓజీలో ఆ పాట నిజమే!

ABN , Publish Date - Sep 22 , 2024 | 08:21 PM

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా నటిస్తుండగా సెట్స్‌ మీద ఉన్న చిత్రాల్లో ‘ఓజీ’ (OG) ఒకటి. సుజీత్‌ (Sujeeth) దర్శకత్వంలో డి.వి.వి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న చిత్రమిది.


పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా నటిస్తుండగా సెట్స్‌ మీద ఉన్న చిత్రాల్లో ‘ఓజీ’ (OG) ఒకటి. సుజీత్‌ (Sujeeth) దర్శకత్వంలో డి.వి.వి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న చిత్రమిది. తమన్‌ (Thaman) సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో తమిళ నటుడు శింబు (Simbu) ఓ పాట పాడనున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. ఇప్పుడు దానిపై క్లారిటీ వచ్చింది. శింబుతో కలిసి తమన్‌, సుజీత్‌ దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ క్లారిటీ ఇచ్చింది. దీనిని బట్టి 'ఓజీ’లో శింబు పాట పాడారని తెలుస్తోంది. త్వరలోనే ఆ పాట బయటకు రానుందని నిర్మాణ సంస్థ పోస్ట్‌ చేసింది. గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌గా ‘ఓజీ’ తెరకెక్కుతోంది. ప్రియాంకా మోహన్‌ హీరోయిన్‌. ఇమ్రాన్‌ హష్మీ విలన్‌గా కనిపించనున్నారు. రాజకీయాల్లో బిజీ అయిన పవన్‌ కల్యాణ్‌ ‘హరి హర వీరమల్లు’, ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ చిత్రాలను పూర్తి చేయాల్సి ఉంది. ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్‌ ఈ నెల 23న పునః ప్రారంభం కానుంది. అదే రోజు పవన్‌ సెట్స్‌లో అడుగుపెట్టనున్నారని ఇటీవల మేకర్స్‌ తెలిపారు. 

Updated Date - Sep 22 , 2024 | 08:21 PM