Siddu Jonnalagadda: హర్షను కమెడియన్ గా చూడటం నచ్చదు..!
ABN , Publish Date - Feb 20 , 2024 | 03:59 PM
వైవా హర్షను ఓ కమెడియన్ అని చెప్పాడం నాకు నచ్చదు. అతను కామిక్ యాక్టర్. తనకంటూ ఓ కామెడీ టైమింగ్ ఉంటుంది. కలర్ ఫోటో, మంత్ ఆఫ్ మధు, బేబీ ఇలా ఎప్పటికప్పుడు హర్ష తనకి తాను నటుడిగా నిరూపించుకుంటూ వస్తున్నారు.
వైవా హర్షను ఓ కమెడియన్ అని చెప్పాడం నాకు నచ్చదు. అతను కామిక్ యాక్టర్. తనకంటూ ఓ కామెడీ టైమింగ్ ఉంటుంది. కలర్ ఫోటో, మంత్ ఆఫ్ మధు, బేబీ ఇలా ఎప్పటికప్పుడు హర్ష తనకి తాను నటుడిగా నిరూపించుకుంటూ వస్తున్నారు. దర్శకుడు కళ్యాణ్ సంతోష్ చేస్తున్న తొలి ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇవ్వాలి’’ అని సిద్ధూ జొన్నలగడ్డ అన్నారు. వైవా హర్ష కీలక పాత్రలో నటించిన చిత్రం ‘సుందరం మాస్టర్’. దివ్య శ్రీపాద కథానాయిక. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు. ఆర్‌టీ టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదల కాబోతోంది. సోమవారం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి సిద్ధూ జొన్నలగడ్డ అతిథిగా హాజరై బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ‘సుందరం మాస్టర్ ట్రెలర్ చూశాను. ఎంతో బాగుంది. నాకు హర్ష పర్సనల్‌గా కూడా తెలుసు. ఆఫ్ స్క్రీన్ లోను బాగా నవ్విస్తుంటాడు. ట్రైలర్‌లో చూసినట్టుగా హర్షని సీరియస్‌గా ఎప్పుడూ చూడలేదు. ఈ చిత్రం పెద్ద హిట్ కావాలి’’ అని అన్నారు.
హర్ష చెముడు మాట్లాడుతూ "మెగాస్టార్ చిరంజీవి గారు ఇచ్చిన సపోర్ట్‌ను ఎప్పటికీ మర్చిపోలేం. నాగ చైతన్య సాయిధరమ్‌తేజ్ టీజర్ లాంచ్ చేసి సహకరించారు. స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి గారు, రవితేజ గారు, సిద్దు జొన్నలగడ్డ మాకు సపోర్ట్‌గా నిలిచారు. పదేళ్ల క్రితం ఆ ఆడియెన్స్ మధ్యలో ఉన్నాను. ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఉన్నాను. మనం గట్టిగా నమ్మితే ఏదైనా సాధించగలం’. ఓ కొత్త ప్రయత్నం చేశా. ఫిబ్రవరి 23న మా చిత్రాన్ని థియేటర్లో చూసి ఎంకరేజ్ చేయండి’ అని అన్నారు.
" ప్రకృతి అందరికీ ఒకేలా కనిపించదు. రైతుకు వర్షం అన్నం పెడితే.. రోడ్డు పక్కన బిజినెస్ చేసేవాళ్లకు ఫుడ్ లాక్కుంటుంది. అలా ఈ సినిమాను ఎన్నో కోణాల్లో చూపించాం. సున్నితంగా సాగే ఈ కథను ఎంతో సహజంగా తెరకెక్కించాం. టీమంతా కష్టపడి పనిచేశాం. శ్రీచరణ్ పాకాల సంగీత సినిమాకు ఎసెట్ అవుతుంది. రవితేజ గారు మాకు అందించిన సపోర్ట్‌ను ఎప్పటికీ మరిచిపోలేం. మా అందరినీ బలంగా నమ్మి హర్ష మాకు సపోర్ట్ చేశారు. చిరంజీవి గారు, నాగ చైతన్య గారు, సిద్దు గారు మా సినిమాకు సపోర్ట్ చేశారంటే అది హర్ష గారి వల్లే. కలర్ ఫోటో సినిమా చూశాక హర్ష గురించి నాకు ఓ మీమ్ కనిపించింది. బంగారపు హుండీని చిల్లర కోసం వాడుతున్నార్రా అనే మీమ్ కనిపించింది. మేం మాత్రం బంగారమే వేశాం. దివ్య పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో తెలియదు కానీ.. మా అందరికీ గౌరవాన్ని తీసుకొస్తుంది. సినిమా చూసిన వారందరికీ సంతృప్తిని మాత్రం ఇస్తుంది’ అని అన్నారు.
"2013లో వైవా హర్ష షార్ట్ప్ ఫిల్మ్స్ చూసి నాలో కాన్ఫిడెన్స పెరిగింది. రంగు ముఖ్యం కాదు కంటెంట్ ఉంటే జనాలు చూస్తారని అర్థమైంది. 2015లో సుహాస్‌తో కలర్ ఫోటో ప్రారంభించినప్పుడు హర్ష మాకు ఇన్‌స్పిరేషన్. ఇప్పుడు హీరోగా సుందరం మాస్టర్‌తో హర్ష ఎన్నో రూల్స్ బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని సందీప్ రాజ్ అన్నారు.
"మా కథ నమ్మి రవితేజగారు మాలో భాగమయ్యారు. ఆయన ముందుకొచ్చాక మా మీద మాకు నమ్మకం ఏర్పడింది. సినిమా బాగా వచ్చింది. మంచి చిత్రం అవుతుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత సుధీర్ అన్నారు.